
Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు AIMIM మద్దతు ఇస్తుందని, యశ్వంత్ సిన్హా (Yashwant Sinha)కే తమ పార్టీ నేతలు ఓటు వేస్తారని ఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తెలిపారు. ఇంతకుముందు.. యశ్వంత్ సిన్హా తనకు ఫోన్ చేశారని తెలిపారు. జూన్ 21న జరిగిన విపక్ష నేతల సమావేశంలో రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరును ప్రకటించారు. అప్పటి నుండి, యశ్వంత్ సిన్హా.. తన మద్దతు కోసం అనేక పార్టీలతో మాట్లాడారు. పలువురు నేతలతో భేటీ అవుతున్నారు.
తాజాగా సోమవారం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) సిన్హాకు మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలో యశ్వంత్ సిన్హా అసదుద్దీన్ ఒవైసీని ఫోన్‌లో సంప్రదించి మద్దతు కోరారు. ఆ తర్వాత ఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హాకు ఓటు వేస్తానని తెలిపారు.
నామినేషన్ దాఖాలు
ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సోమవారం పలువురు విపక్ష నేతల సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు. యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వాన్ని 14 ప్రధాన ప్రతిపక్ష పార్టీలు సమర్థించాయి. నామినేషన్ దాఖలు సమయంలో ఆయన వెంట నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ బెనర్జీ, J&K నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన ఫరూక్ అబ్దుల్లా, RLD యొక్క జయంత్ సిన్హా, CPI(M) చెందిన సీతారాం ఏచూరి, DMK చెందిన A రాజా, CPI చెందిన D రాజా,TRS నాయకుడు K. .టీ. రామారావు పార్లమెంట్‌లో విపక్ష నేతలు ఆయనకు మద్దతుగా నిలిచారు. రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన మిసా భారతి, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీకి చెందిన ఎన్‌కె ప్రేమచంద్రన్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌కు చెందిన మహ్మద్ బషీర్ కూడా హాజరయ్యారు.
జూలై 18న ఎన్నికలు: రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి జూన్ 29 చివరి తేదీ కాగా.. జూలై 18 న ఎన్నికలు జరుగనున్నాయి.