కుక్క అరుపులు: స్థానికుల వాగ్వాదం, దాడి.. గుండెపోటుతో యజమాని మృతి

By Siva KodatiFirst Published Feb 13, 2020, 4:08 PM IST
Highlights

కుక్క మోరిగిందని నలుగురు మహిళలు ఓ మహిళపై దాడి చేయడంతో ఆమె భయాందోళనలకు గురై గుండెపోటుతో మరణించింది. 

కుక్క మోరిగిందని నలుగురు మహిళలు ఓ మహిళపై దాడి చేయడంతో ఆమె భయాందోళనలకు గురై గుండెపోటుతో మరణించింది. వివరాల్లోకి వెళితే.. దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని డోంబివ్లిలో నాగమ్మ శెట్టి అనే 35 ఏళ్ల వితంతువు తన కుమార్తెతో కలిసి నివసిస్తోంది.

ఆమె తన ఇంట్లో ఓ కుక్కను పెంచుకుంటోంది. మంగళవారం ఆ శునకం అదే పనిగా మొరుగుతుండటంతో అక్కడికి దగ్గరలో ఉంటున్న నలుగురు మహిళలు భరించలేక నాగమ్మ దగ్గరికి వచ్చి అరవకుండా చూసుకోవాల్సిందిగా కోరారు.

Also Read:ఇంతకన్న ఆ జన్మకు ఇంకేం కావాలి

అయినప్పటికీ కుక్క అదే పనిగా అరవడంతో ఆవేశానికి లోనైన మహిళలు మళ్లీ వచ్చి నాగమ్మతో వాగ్వాదానికి దిగారు. ఇది తారాస్థాయికి చేరడంతో నలుగురు మహిళలను నాగమ్మపై భౌతిక దాడి చేసి కిందపడేసి కాలితో ఛాతిపై తన్ని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

వీరి దాడిలో తీవ్రంగ గాయపడిన బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అనంతరం ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లింది. వైద్యులు చికిత్స అందిస్తుండగానే ఆమె మరణించింది.

Also Read:జీవనాధారమే ఆయువు తీసింది: యజమానిని పొడిచి చంపిన ఆవు

ఈ ఘటనపై పోలీస్ అధికారులు మాట్లాడుతూ.. నాగమ్మ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చారని, అయితే ముందు ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాల్సిందిగా సూచించినట్లు చెప్పారు.

తమ సూచనను పట్టించుకోకుండా ఆమె ఇంటికి వెళ్లారని, ఆ తర్వాత ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లారని తెలిపారు. చికిత్స చేస్తుండగానే నాగమ్మ మరణించారని.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో బాధితురాలు గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు.

click me!