ఆస్తులు ప్రకటించిన ఒడిషా కేబినెట్.. అందరిలోకి ధనవంతుడు ఆయనే

By Siva KodatiFirst Published Feb 13, 2020, 2:45 PM IST
Highlights

నవీన్ పట్నాయక్.. పరిచయం అక్కర్లేని పేరు. 2000వ సంవత్సరం నుంచి ఒడిషాను అప్రతిహతంగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి. మిస్టర్ క్లీన్‌గా, మచ్చలేని వ్యక్తిగా క్లీన్ ఇమేజ్‌తో దేశంలోని రాజకీయవేత్తల్లో మంచి పేరు సంపాదించిన వ్యక్తి. అలాంటి నవీన్ తాజాగా ఓ అరుదైన ఘనతను సాధించారు. 

నవీన్ పట్నాయక్.. పరిచయం అక్కర్లేని పేరు. 2000వ సంవత్సరం నుంచి ఒడిషాను అప్రతిహతంగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి. మిస్టర్ క్లీన్‌గా, మచ్చలేని వ్యక్తిగా క్లీన్ ఇమేజ్‌తో దేశంలోని రాజకీయవేత్తల్లో మంచి పేరు సంపాదించిన వ్యక్తి. అలాంటి నవీన్ తాజాగా ఓ అరుదైన ఘనతను సాధించారు.

ఒడిశా కేబినెట్‌లోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం సీఎంతో పాటు మంత్రుల ఆస్తుల జాబితాను బుధవారం అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. దీని ప్రకారం.. 2019 మార్చి 31వ తేదీ నాటికి తనకు రూ.64.26 కోట్ల ఆస్తులున్నాయని నవీన్ పట్నాయక్ ప్రభుత్వానికి తెలియజేశారు.

Also Read:శంఖం మోగేలా! ఐదోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్న నవీన్ పట్నాయక్

ఇందులో రూ.62 కోట్లు స్థిరాస్థులు.. ఇవి తనకు తల్లిదండ్రుల నుంచి సంక్రమించాయని నవీన్ తెలిపారు. 2014లో ఆయన స్థిరాస్తుల విలువ రూ.12 కోట్లు కాగా.. 2019 నాటికి ఇవి రూ.63 కోట్లకు పెరిగాయి.

ముఖ్యమంత్రికి న్యూఢిల్లీలోని ఏపీజే అబ్ధుల్ కలాం రోడ్డులో రూ.43 కోట్ల విలువగల నవీన్ నివాస్, ఒడిషాలో రూ.9.5 కోట్ల మరో ఇల్లు.. రూ.25 వేల రూపాయల నగదు మాత్రమే ఉందట.

దీంతో పాటు 1980 నాటి మోడల్‌కు చెందిన అంబాసిడర్ కారు ఉన్నట్లు ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిజేపూర్, హింజిలీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Also Read:మహిళలకు 33 శాతం టిక్కెట్లు: నవీన్ పట్నాయక్ సంచలన ప్రకటన

కాగా.. ఒడిషా మంత్రుల్లో క్రీడలు, ఐటీ శాఖ మంత్రి తుష్కర్ కాంతి బెహ్రా చివరి వరుసలో నిలిచారు. ఆయన తన ఆస్తి కేవలం రూ.25 లక్షలుగా పేర్కొన్నారు. మరోవైపు సీఎంతో పాటు మంత్రులు తమ ఆస్తులను బహిరంగంగా ప్రకటించి దేశానికి ఆదర్శంగా నిలిచారు. 

click me!