ఇంతకన్న ఆ జన్మకు ఇంకేం కావాలి
తప్పినపోయిన తన పెంపుడు శునకం తన దగ్గరకు చేరడంతో ఓ యాజమాని భావోద్వేగం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మూగ జీవిపై ఆ యజమాని చూపించిన ప్రేమకు ఇంతకన్న శనక జన్మకు ఇంకేం కావాలంటూ అక్కడ ప్రతి ఒక్కరు తమ మదిలో తలుచుకున్నారు.
మనుషులనే పట్టించుకోని నేటి సమాజంలో ఓ మూగజీవితో వీడిదీయ లేని బంధం ఏర్పడుచుకున్నారు ఓ వ్యక్తి. తను అల్లరిముద్దుగా పెంచుకున్న శునకం నేల బొర్రా లోకి వెళ్ళి ఇరుక్కుపోయి తిరిగి తన దగ్గర చేరిన సమయంలో అతని భావోద్వేగం అందరి కళ్ళలో కన్నీరు పెట్టించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మనిషికి జీవన గమనంలో పెంపుడు జంతువులు భాగమయ్యాయని తెలపడినికి ఈ సంఘటనే ఓ ఉదాహరణ.
కాపలా.. కాలక్షేపం.. హోదా.. ఆత్మీయత.. ఒంటరితనం ఇలా ఏదైనా అయినప్పటికి జంతువులు మనిషికి దగ్గరైపోతున్నాయి. అవి యాజమాని పట్ల కనబరిచే విశ్వాసం,ప్రేమతో మనుషులతో అవి వీడదియరాని బంధాన్ని ఏర్పాచుకుంటున్నాయి. అందుకు తాజాగా జరిగిన సంఘటనే సాక్షంగా నిలిచింది.
అలన్ విట్టన్ అనే జంతుప్రేమికుడు తన ఇంట్లో పలు రకాల కుక్కలను పెంచుకుంటున్నాడు. ఉదయం నడకలో భాగంగా తన పెంపుడు కుక్కైనా మిట్జీని తనతొ పాటు తీసుకువెళ్ళాడు. తన కంటే ముందు పరిగెత్తిన ఆ శునకం కొద్దీ దూరం వెళ్ళక తనకు కనిపించలేదు. దీంతో కంగారు పడిన ఆయన చూట్టూ ప్రక్కల అంతా వేతికారు. అయిన అది కనిపించకపోవడంతో ఆందోళన చెందిన అలన్ కుంటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు వారు కూడా వచ్చి వెతికిన ఫలితం లేకపోయింది. ఆ రోజు అంతా దాని చూసిన అది కనిపించలేదు. దీంతో వారు నిరాశతో వెనుదిరగకా తప్పలేదు.
అయినప్పటి అలన్ అన్వేషణ అగలేదు. మరుసటి రోజు కూడా తప్పిపోయిన ప్రాంతానికి వచ్చి దాని కోసం చూశాడు. ఆ రోజు కూడా మిట్జీ ఆయనకు కనిపించలేదు. మూడు రోజు తన ఇంటి పక్కన ఉండే ఓ వ్యక్తి మిట్జీ నెల బొర్రాలో చిక్కుకపోయిందని అలన్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో వెంటనే ఆ ప్రాంతానికి చెరుకున్న ఆయన మిగితా వారి సహయంతో దాన్ని తీశాడు. అనంతరం దాన్ని హత్తుకుని ఆతను భావోద్వేగానికి గురైన సన్నీవేశం అక్కడ ఉన్న వారందరిని ఎమోషన్‌కు గురిచేసింది. మూగ జీవిపై ఆ యజమాని చూపించిన ప్రేమకు ఇంతకన్న శనక జన్మకు ఇంకేం కావాలంటూ అక్కడ ప్రతి ఒక్కరు తమ మదిలో తలుచుకున్నారు.
తప్పినపోయిన తన పెంపుడు శునకం తన దగ్గరకు చేరడంతో ఓ యాజమాని భావోద్వేగం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మూగ జీవిపై ఆ యజమాని చూపించిన ప్రేమకు ఇంతకన్న శనక జన్మకు ఇంకేం కావాలంటూ అక్కడ ప్రతి ఒక్కరు తమ మదిలో తలుచుకున్నారు.