సైబర్ క్రైం.. కేవైసీ పేరుతో ఆర్బీఐ రిటైర్డ్ ఉద్యోగికే బురిడీ..

By AN TeluguFirst Published Nov 13, 2021, 3:14 PM IST
Highlights

70యేళ్ల ఆర్బీఐ రిటైర్డ్ మహిళా ఉద్యోగికి KYC అప్ గ్రేడేషన్ కోసం హెచ్చరిస్తూ ఎస్ బీఐ నుంచి ఒక టెక్ట్స్ మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె ఆ టెక్ట్స్ మెసేజ్ లో వచ్చిన నెంబర్ కి కాల్ చేస్తే సదరు వ్యక్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి రాహుల్ గా పేర్కొన్నాడు.

ముంబై : ఇటీవల కాలంలో చాలా రకాల సైబర్ మోసాలను చూశాం. కానీ చాలా వరకు చదువుకున్నవారు, గృహిణులు, రిటైర్డ్ ఉద్యోగులు మోసపోవడం చూశాం. అచ్చం అలాగే ఇప్పుడు తాజాగా ఒక ఆర్ బీఐ రిటైర్డ్ ఉద్యోగి ఆన్ లైన్ సైబర్ మోసానికి గురైంది. 

అసలు విషయంలోకి వెడితే.. 70యేళ్ల RBI retired మహిళా ఉద్యోగికి KYC అప్ గ్రేడేషన్ కోసం హెచ్చరిస్తూ ఎస్ బీఐ నుంచి ఒక టెక్ట్స్ మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె ఆ టెక్ట్స్ మెసేజ్ లో వచ్చిన నెంబర్ కి కాల్ చేస్తే సదరు వ్యక్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి రాహుల్ గా పేర్కొన్నాడు.

అంతేకాదు సీనియర్ సిటిజన్ల కోసం కేవైసీ ఆన్ లైన్ అప్ గ్రేడేషన్ కి సంబంధించిన ఒక కొత్త సేవను బ్యాంక్ ప్రారంభించిందంటూ నమ్మ బలికాడు. దీంతో ఆమె అతను పంపించిన వెబ్ లింక్ ను ఓపెన్ చేసి చూసింది. అయితే, ఆ వెబ్ పేజీ లో SBI logoతో సహా ఉండటంతో ఆమె పూర్తిగా అతన్ని నమ్మింది. 

ఆ వెబ్ పేజ్ లో తన పూర్తి వివరాలు, బ్యాంక్ అకౌంట్ తో సహా నమోదు చేసింది. ఇక అంతే ఏకంగా ఆరు లావాదేవీల్లో ఒక్కసారిగా రూ. 3 లక్షలు పోయినట్లు గుర్తించి వెంటనే ఆమె బ్యాంక్ కి కాల్ చేసి కార్డుని బ్లాక్ చేయించింది. ఆ తరువాత బాధితురాలు చితలస్ మాన్ పాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Right To Dress: మహిళా టీచర్లు చీరలే కట్టుకోవాలా?.. కేరళ ప్రభుత్వ నిర్ణయమిదే

గతనెలలో ఇలాంటి మోసానికే సిద్దిపేటకు చెందిన ఓ Software Engineerమోసపోయాడు. కొత్త Credit cardను వాడుకోవడానికి యత్నించే దశలో  ఖాతాలోని సొమ్మును మొత్తం పోగొట్టుకున్నాడు. సిద్దిపేట త్రీటౌన్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రంగదాంపల్లి కి చెందిన కార్తీక్ రెడ్డి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. వర్క ఫ్రం హోం కావడంతో ప్రస్తుతం ఇంటి నుంచే పని చేస్తున్నాడు.

ఈ మధ్యనే ఇండస్ ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డు తీసుకున్నాడు. అయితే దాన్ని వాడే క్రమంలో.. కొన్ని ఇన్ పుట్స్ కోసం ఫోన్లోని నెట్ లో వెతికాడు.. ఈ నెల 16న బ్యాంకు ప్రతినిధిగా ఓ వ్యక్తి ఫోన్ లో పరిచయం చేసుకుని కార్డు నెంబర్ పనిచేయడం నిమిత్తం Link పంపుతున్నారని దాని తెరవాలని సూచించాడు.

కార్తీక్  లింకును తెరవగానే అతని  Accountలో ఉన్న రూ.49,995  డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది.  దీంతో ఏం జరిగిందో అర్థం కాని కార్తీక్ సంబంధిత బ్యాంకు కి వెళ్లి విచారించగా  నగదు డెబిట్ అయినట్లు సిబ్బంది చెప్పారు. దీంతో తాను సైబర్ క్రైం ఉచ్చులో పడ్డట్టు కార్తీక్ రెడ్డి గుర్తించాడు. బ్యాంకు వారి సూచన తో సోమవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. 

click me!