
దోపిడీ కేసుకు సంబంధించి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం డీ-గ్యాంగ్‌తో సంబంధం ఉన్న ఐదుగురిని ముంబై క్రైమ్ బ్రాంచ్ యాంటీ ఎక్స్‌టార్షన్ సెల్ సోమవారం రాత్రి అరెస్టు చేసింది. ఈ ఐదుగురు సభ్యులు ఇప్పటికీ డి-గ్యాంగ్‌లో చురుకుగా ఉన్నారు. దోపిడీల్లో పాల్గొంటున్నారు.
రైల్లో వేలాడుతూ మరణాయుధాలతో వీరంగం.. ముగ్గురు ఆకతాయుల అరెస్ట్
ముంబై పోలీసులు గతంలో గ్యాంగ్‌స్టర్ ఛోటా షకీల్ బావ అయిన సలీం ఖురేషీ అలియాస్ సలీం ఫ్రూట్, దావూద్ సన్నిహితుడైన రియాజ్ భాటిలను అరెస్టు చేశారు. వారి వాంగ్మూలాలను నమోదు చేసిన తర్వాత గ్యాంగ్ లోని మరో ఐదుగురు సభ్యులను తాజాగా అంధేరీ ప్రాంతంలో అరెస్టు చేశారు.
మొత్తం ఐదుగురినీ ఈ రోజు కోర్టులో హాజరుపర్చనున్నారు, అనంతరం పోలీసులు వారిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరనున్నారు. ముంబై అంతటా బిల్డర్లు, వ్యాపారవేత్తల నుండి అనేక మంది డబ్బు వసూలు చేసినట్టు పోలీసులకు సమాచారం ఉంది. కాబట్టి మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తోంది.
ఫ్రూట్, భాటితో కలిసి వెర్సోవాకు చెందిన ఓ వ్యాపారవేత్త నుండి రూ. 7.5 లక్షల మొత్తాన్ని బలవంతంగా లాక్కున్నాడు. దాదాపు రూ. 30 లక్షల విలువైన అతని రేంజ్ రోవర్‌ను కూడా తీసుకెళ్లాడు. ఫిబ్రవరి 3వ తేదీన ఢిల్లీలో నమోదైన టెర్రర్-ఫండింగ్ కేసులో ప్రమేయం ఉన్న నేపథ్యంలో ఫ్రూట్‌ను ఆగస్టు 4వ తేదీన ఎన్ఐఏ అరెస్టు చేసింది. దోపిడీ కేసుకు సంబంధించి ముంబై పోలీసుల యాంటీ ఎక్స్‌టార్షన్ సెల్ గత నెలలో భాటిని కూడా అరెస్టు చేసింది.
తల్లి ముందే మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం, ఇద్దరి అరెస్ట్...
ఇదిలా ఉండగా ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు నిన్న సలీం ఫ్రూట్‌పై దోపిడీ కేసులో మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA)లోని కఠినమైన సెక్షన్లను ప్రయోగించారు.