దారుణం : కేరళలో ఇద్దరు మహిళల నరబలి, ముగ్గురి అరెస్ట్..

By SumaBala BukkaFirst Published Oct 11, 2022, 12:11 PM IST
Highlights

కేరళలో ఇద్దరు మహిళల్ని నరబలి ఇచ్చిన ఘటన సంచలనంగా మారింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 
 

కేరళ : కేరళలో నరబలి ఘటన కలకలం రేపింది. ఈ కేసులో అదృశ్యమైన ఇద్దరు మహిళలు మరణించారు. నివేదికల ప్రకారం, మరణించిన ఇద్దరు మహిళలు ఎర్నాకుళం జిల్లాకు చెందినవారు. వీరిని తిరువల్లకు తీసుకువచ్చి ఇక్కడ బలి ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం ముగ్గురు వ్యక్తులు పోలీసుల అదుపులో ఉన్నారు. వీరిని భగవాల్ సింగ్, లైలా, షఫీ అకా రషీద్ లుగా గుర్తించారు. మహిళలను అక్రమంగా తరలించిన ఏజెంట్‌, దంపతులను కూడా అరెస్టు చేశారు. తిరువళ్లకు చెందిన భగవత్, పెరుంబవూరుకు చెందిన అతని భార్య లీల, పెరుంబవూరుకు చెందిన షిహాబ్ లు కూడా నరబలి కేసులో అరెస్టయ్యారు.

సమాచారం ప్రకారం, పెరుంబవూరులోని ఒక ఏజెంట్ స్త్రీలను తిరువళ్లకు తీసుకురావడంలో సహాయం చేశాడు. తిరువళ్లలో అష్టైశ్వర్యాలతో తులతూగాలనే కోరికతో ఈ నరబలి నిర్వహించినట్టు తెలుస్తోంది. అయితే కడవంతరలో అదృశ్యమైన మహిళ కోసం తిరువళ్ల వరకు వెతికారు. ఇదే క్రమంలో కలడికి చెందిన మరో మహిళ కూడా హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు.

తల్లి ముందే మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం, ఇద్దరి అరెస్ట్...

బలి ఇచ్చిన ఇద్దరి మృతదేహాలను ఖననం చేశారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. ఆ ప్రాంతం సంపదతో తులతూగాలనే కోరికతో నరబలి ఇచ్చిన సంఘటన కేరళలో ఇంతకు ముందు ఎప్పుడూ నివేదించబడలేదు. కానీ దేశంలోని ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి. అక్షరాస్యత అధికంగా ఉండే కేరళలో నరబలి లాంటి మూఢనమ్మకం ఘటన వెలుగు చూడడం సంచలనం రేపింది.

కలాడికి చెందిన మహిళను మరో కారణంతో పతనంతిట్టకు తీసుకెళ్లారు. పెరుంబావూరుకు చెందిన ఏజెంట్లే దీనికి ప్లాన్ వేసినట్లు సమాచారం. ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా సృష్టించి తిరువళ్లకు చెందిన భగవత్‌ను కలిశారు. పెరుంబవూరుకు చెందిన వ్యక్తిని ప్రసన్నం చేసుకుంటే జీవితంలో గొప్ప లాభాలు వస్తాయని ఫేస్‌బుక్ ద్వారా భగవత్‌ను నమ్మించాడు. దీని తర్వాత, మహిళను కలాడి నుండి తిరువళ్లకు తీసుకెళ్లారు. 

ఆమెను కాలడికి చెందిన ఓ వ్యక్తి గొంతు నులిమి హత్య చేశాడు. సెప్టెంబరు 27న పొన్నూరున్ని ప్రాంతానికి చెందిన మహిళను కడవంత్ర నుంచి తిరువళ్లకు తీసుకెళ్లారు. ఈ మహిళ మొబైల్ టవర్ లొకేషన్‌ తో దర్యాప్తు చేపట్టిన పోలీసుల విచారణ తిరువళ్లలో ముగింపుకు వచ్చింది. 

click me!