ముంబ‌యి ఎయిర్ పోర్టుకు ఉగ్ర‌వాదుల బెదిరింపు కాల్.. హై అల‌ర్ట్ లో అధికారులు

Published : Feb 07, 2023, 02:41 PM IST
ముంబ‌యి ఎయిర్ పోర్టుకు ఉగ్ర‌వాదుల బెదిరింపు కాల్.. హై అల‌ర్ట్ లో అధికారులు

సారాంశం

New Delhi: ముంబ‌యి ఎయిర్ పోర్టుకు ఇండియన్ ముజాహిదీన్ నుంచి బెదిరింపు కాల్ వ‌చ్చింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు, పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి తనను తాను ఇర్ఫాన్ అహ్మద్ షేక్ గా, ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ సభ్యుడిగా పరిచయం చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.  

Mumbai Airport Gets Threat Call:  దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యి హై అల‌ర్ట్ కొన‌సాగుతోంది. ముంబ‌యి ఎయిర్ పోర్టుకు ఒక ఉగ్ర‌వాద సంస్థ నుంచి బెదిరింపు కాల్ వ‌చ్చింది. ఇండియన్ ముజాహిదీన్ నుంచి ఈ  బెదిరింపు కాల్ వ‌చ్చింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు, పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి తనను తాను ఇర్ఫాన్ అహ్మద్ షేక్ గా, ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ సభ్యుడిగా చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. ముంబ‌యి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సోమవారం ఉగ్ర‌వాద బెదిరింపు కాల్ రావడంతో రాష్ట్ర పోలీసులు, ఇతర ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్రకారం.. కాల్ చేసిన వ్యక్తి తనను ఇర్ఫాన్ అహ్మద్ షేక్ అనీ, ఉగ్రవాద సంస్థ-ఇండియన్ ముజాహిదీన్ సభ్యుడిగా పరిచయం చేసుకున్నాడు. “సోమవారం బెదిరింపు కాల్ రావడంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముంబ‌యి పోలీసులు, ఇతర ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. కాలర్ తనను ఇర్ఫాన్ అహ్మద్ షేక్ అనీ, ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ సభ్యుడిగా పరిచయం చేసుకున్నాడు” అని పోలీసులు త‌మ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

 

ముంబై పోలీసుల నుండి అందిన సమాచారం ప్రకారం, వారికి కాల్ వచ్చిన వెంటనే విమానాశ్రయం వద్ద భద్రతను పెంచారు. ప్రతి అనుమానాస్పద కదలికలపై నిశితంగా పరిశీలించడానికి ఏజెన్సీలను అప్రమత్తం చేశారు. ఆ ప్రాంతంలో త‌నిఖీలు సైతం నిర్వ‌హిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఫిబ్రవరి 3న, ముంబ‌యిలో ఉగ్రదాడి చేస్తామని బెదిరిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కి ఒక గుర్తుతెలియని వ్యక్తి నుంచి తాలిబానీ సభ్యుడిగా మెయిల్ వచ్చిందని ఏఎన్ఐ నివేదించింది. "బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తి తనను తాను తాలిబానీగా పేర్కొన్నాడు.

సోమవారం బెదిరింపు కాల్ రావడంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముంబయి పోలీసులు, ఇతర ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. కాలర్ తనను ఇర్ఫాన్ అహ్మద్ షేక్ అనీ, ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ సభ్యుడిగా పరిచయం చేసుకున్నాడు. కేసు నమోదు చేయబడింది, దర్యాప్తు కొనసాగుతోంది : ముంబయి పోలీసులు
 

ముంబ‌యిలో ఉగ్రదాడి జరుగుతుందని అతను చెప్పాడు" అని ముంబ‌యి పోలీసు వర్గాలు తెలిపాయి. అంత‌కుముందు, జనవరిలో ముంబ‌యిలో ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌కు బెదిరింపు కాల్ వచ్చింది, అందులో గుర్తు తెలియని వ్యక్తి పాఠశాలను పేల్చివేస్తానని బెదిరించాడు. ముంబ‌యి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పాఠశాలలోని ల్యాండ్‌లైన్‌కు సాయంత్రం 4:30 గంటలకు కాల్ వచ్చింది. స్కూల్‌లో టైం బాంబ్ పెట్టినట్లు కాల్ చేసిన వ్యక్తి పేర్కొన్నాడ‌ని స‌మాచారం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nitin Nabin Assets Full Details | Nitin Nabin 2025 Election | Loans, Property | Asianet News Telugu
సొంతూళ్లోనే ఉంటూ రోజుకు రూ.6-7 వేల సంపాదన.. ఓ మహిళ సక్సెస్ స్టోరీ