ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా 58,626 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు: విద్యా మంత్రిత్వ శాఖ

By Mahesh RajamoniFirst Published Feb 7, 2023, 2:16 PM IST
Highlights

New Delhi: ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో 58,626 టీచింగ్, నాట్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేంద్రీయ విద్యాల‌యాలలో  ఖాళీల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించిందనీ, ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రకటనలు ఇచ్చామని విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ తెలిపారు.
 

Minister of state for education Subhas Sarkar: ప్రభుత్వ నిర్వహణలోని సంస్థల్లో 58,626 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ సోమవారం పార్లమెంట్‌కు తెలియజేసింది. ఇందులో టీచింగ్ పోస్టులు 29,276, నాన్ టీచింగ్ పోస్టులు 29,350 ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఎందుకు ఎక్కువ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయని ద్రవిడ మున్నేట్ర కజగం నాయ‌కులు కళానిధి వీరాస్వామి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ విద్యాశాఖ మంత్రి సుభాస్ సర్కార్ పై వివ‌రాలు వెల్ల‌డించారు. 

ప్రమోషన్, కొత్త స్ట్రీమ్‌ల అప్‌గ్రేడేషన్/మంజూరీ అలాగే విద్యార్థుల సంఖ్య‌ను పెంపొందించడం వల్ల అదనపు అవస‌రాలుగా మంత్రి పేర్కొన్నారు. ఖాళీలను భర్తీ చేయడం అనేది నిరంతర ప్రక్రియ- సంబంధిత సంస్థ రిక్రూట్‌మెంట్ నియమాల నిబంధనల ప్రకారం ఖాళీలను భర్తీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయ‌ని సుభాస్ సర్కార్ తెలిపారు. బోధన-అభ్యాస ప్రక్రియకు ఆటంకం కలగకుండా చూసేందుకు కేంద్రీయ విద్యాలయ సంగతన్ (KVS), నవోదయ విద్యాలయ సమితి (NVS) ద్వారా తాత్కాలిక వ్యవధి కోసం ఉపాధ్యాయులు కూడా ఒప్పంద ప్రాతిపదికన ఉన్నార‌ని తెలిపారు.

కేంద్రీయ విద్యాల‌యాలలో  ఖాళీల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించిందనీ, ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రకటనలు ఇచ్చామని విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ తెలిపారు. "విద్య నాణ్యత-సామర్థ్యాన్ని నిర్ధారించడానికి ఉపాధ్యాయులను నవీకరించడానికి-సాధికారత కల్పించడానికి శిక్షణా కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు కూడా నిర్వహించబడతాయి" అని ఆయన తెలిపారు.

కేంద్ర ప్ర‌భుత్వ మంత్రిత్వ శాఖ‌ల్లో10 ల‌క్ష‌ల ఉద్యోగ ఖాళీలు

కేంద్ర ప్ర‌భుత్వ మంత్రిత్వ శాఖ‌ల్లో దాదాపు 10 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయ‌ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. 78 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో 9.79 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని కేంద్ర వ్యక్తిగత, ప్రజా ఫిర్యాదుల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభకు తెలిపారు. రైల్వేలో 2.93 లక్షలు, రక్షణ శాఖలో 2.64 లక్షలు, హోం మంత్రిత్వ శాఖల్లో 1.43 లక్షల ఖాళీలు ఉన్నాయని బీజేపీ ఎంపీ సుశీల్ మోడీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయ‌న పై వివ‌రాలు వెల్ల‌డించారు. 

దేశవ్యాప్తంగా జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామనీ, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్తి సంస్థల్లో కొత్త నియామకాలు జరుగుతున్నాయని జితేంద్ర సింగ్ తెలిపారు. "... ఇది (రోజ్గార్ మేళా) మరింత ఉపాధి-స్వయం ఉపాధి కల్పనలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుందనీ, ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలంలో 1 మిలియన్ యువతకు లాభదాయకమైన సేవా అవకాశాలను అందిస్తుందని భావిస్తున్నాము" అని జితేంద్ర సింగ్ చెప్పారు.

కాగా,  భారత సైన్యంలో 2021లో 1,512 ఆఫీసర్ పోస్టులను, 2022లో 1,285 పోస్టులను భర్తీ చేసినట్లు కేంద్ర ర‌క్ష‌ణ శాఖ స‌హాయ‌క మంత్రి అజ‌య్ భ‌ట్ వెల్లడించారు. అలాగే, ఇండియన్ ఆర్మీలో ఏడు వేల‌కు పైగా ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. గత ఏడాది నుంచి భారత సైన్యంలో 7,000కు పైగా ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 2022 జనవరి 1 న 7,665 నుండి 2022 డిసెంబర్ 15 నాటికి 7,363 కు పడిపోయిందని మంత్రి పార్లమెంటుకు తెలిపారు.

click me!