మోడీ మరోసారి ప్రధాని : ములాయం ఆసక్తికర వ్యాఖ్యలు

Published : Feb 13, 2019, 04:18 PM IST
మోడీ మరోసారి ప్రధాని : ములాయం ఆసక్తికర వ్యాఖ్యలు

సారాంశం

దేశానికి మరోసారి మోడీ ప్రధాని కావాలని తాను కోరుకొంటున్నట్టుగా  మాజీ కేంద్ర మంత్రి, ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్  అభిప్రాయపడ్డారు.


న్యూఢిల్లీ: దేశానికి మరోసారి మోడీ ప్రధాని కావాలని తాను కోరుకొంటున్నట్టుగా  మాజీ కేంద్ర మంత్రి, ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్  అభిప్రాయపడ్డారు.

దేశంలో మోడీ అనేక మంచి పనులు చేశారు. అతనికి వ్యతిరేకంగా ఎవరూ కూడ వేలేత్తి చూపలేరని ములాయం సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ కారణంగా తాను మరోసారి మోడీని ప్రధాని కావాలని కోరుకొంటున్నట్టుగా ఆయన చెప్పారు.

ఈ రకంగా  తనను  ములాయం సింగ్  ప్రశంసలతో ముంచెత్తడంతో చిరునవ్వుతో ప్రధాని మోడీ ములాయంకు చేతులు ముడిచి ధన్యవాదాలు తెలిపారు.ఇధిలా ఉంటే యూపీ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీని నిలువరించేందుకు గాను  ఎస్పీ, బీఎస్పీతో చేతులు కలిపింది.

ములాయం తనయుడు అఖిలేష్ యాదవ్  మాయావతితో పొత్తు పెట్టుకొన్నాడు. కానీ, ములాయం మాత్రం మోడీకి అనుకూలంగా మాట్లాడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?