హెల్మెట్ తప్పనిసరి రూల్.. వ్యతిరేకిస్తూ సీఎం ధర్నా

By ramya NFirst Published Feb 13, 2019, 3:20 PM IST
Highlights

ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి చేస్తూ..పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్  కిరణ్ బేడీ రూల్స్ పాస్ చేసిన సంగతి తెలిసిందే. 

ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి చేస్తూ..పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్  కిరణ్ బేడీ రూల్స్ పాస్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆమె తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీ నారాయణ స్వామి వ్యతిరేకిస్తున్నారు. ఆమె తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా.. బుధవారం సీఎం నారాయణస్వామి రాజ్ భవన్ ఎదుట ధర్నా  చేపట్టారు.

క్యాబినేట్ మంత్రులతో కలిసి ఆయన ఈ ధర్నాలో పాల్గొన్నారు.  నల్లదుస్తులు ధరించిన సీఎం.. గవర్నర్ నిర్ణయాన్ని రీకాల్ చేయాలంటూ కేంద్రాన్ని కోరారు. ద్విచ‌క్ర‌వాహ‌నాదారులు హెల్మెట్‌ను త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల‌ని డీజీపీ ఆదేశించిన‌ నియ‌మావ‌ళిని ద‌శ‌ల‌వారీగా అమ‌లు చేయాల‌ని సీఎం కోరారు. త‌మ నిర‌స‌న‌ను శాంతియుతంగా తెలియ‌జేస్తున్నామ‌ని ఆయ‌న అన్నారు.

 గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్ బేడీ.. సోమ‌వారం త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. రోడ్డుపై హెల్మెట్ లేకుండా వెళ్తున్న టూవీల‌ర్స్‌ను ఆమె ఆపేశారు. హెల్మెట్లు ధ‌రించాలంటూ ఆమె వారికి వార్నింగ్ ఇచ్చారు. అయితే వాహ‌న‌దారుల ప్రాణ ర‌క్ష‌ణ కోసం గ‌వ‌ర్న‌ర్ తీసుకున్న నిర్ణ‌యాన్ని.. సీఎం నారాయ‌ణ‌స్వామి వ్య‌తిరేకించ‌డం అర్థంలేని పని అని కొందరు అభిప్రాయపడుతున్నారు

click me!