గుండెపోటుతో ‘మిస్టర్ తమిళనాడు’ టైటిల్ విన్నర్ మృతి.. ఆ పొరపాటే కొంపముంచింది..

By SumaBala Bukka  |  First Published Oct 10, 2023, 9:00 AM IST

గుండెపోటుతో ప్రముఖ బాడీ బిల్డర్ యోగేష్ మృతి చెందడం చెన్నైలో తీవ్ర విషాదాన్ని నింపింది. పెళ్లి తరువాత బాడీ బిల్డింగ్ కు దూరంగా ఉన్నాడు యోగేష్. 


తమిళనాడు : ‘మిస్టర్ తమిళనాడు’ టైటిల్ విన్నర్, ప్రముఖ బాడీ బిల్డర్ యోగేష్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఆయన మృతితో కుటుంబ సభ్యుల్లో, అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవల కాలంలో హఠాత్తు గుండెపోటు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా యువకులు, చిన్నపిల్లలు గుండెపోటుకు గురవుతున్నారు. తాజాగా యోగేష్ మరణం చెన్నైలో విషాదాన్ని నింపింది.

చెన్నైలోని అంబత్తూరు మేనంపేడులోని మహాత్మా గాంధీ వీధిలో  యోగేష్ ఉంటున్నాడు. బాడీ బిల్డర్ గా యోగేష్ అనేక ఛాంపియన్షిప్ లలో పాల్గొని ఎన్నో పథకాలను సాధించాడు. 2021లో 9కి పైగా మ్యాచుల్లో పాల్గొన్నాడు  యోగేష్. బాడీ బిల్డింగ్లో ‘మిస్టర్ తమిళనాడు’ అవార్డును అందుకున్నాడు. ఆ తర్వాత 2021లో వైష్ణవి అనే అమ్మాయితో వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం రెండేళ్ల కూతురు ఉంది.

Latest Videos

మణిపూర్ లో రక్తసిక్తమైన వ్యక్తిని దహనం చేసిన వీడియో వైరల్... అధికారులేమంటున్నారంటే...

వివాహం అనంతరం యోగేష్ బాడీ బిల్డింగ్ పోటీలకు దూరంగా ఉన్నాడు. అతను అప్పటినుంచి ఓ జిమ్ లో ట్రైనర్గా పనిచేస్తున్నాడు. ట్రైనర్ గా పనిచేస్తున్న జిమ్ నుంచి శిక్షణ అనంతరం ఇంటికి  వెళ్లడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటికి వెళ్లే ముందు యోగేష్ బాత్రూంకి  వెళ్లాడు.  అక్కడే హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన అక్కడే ఉన్న యువకులు వెంటనే యోగేష్ ను స్థానిక కిల్పౌక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితే అక్కడికి వెళ్లిన తర్వాత  యోగేష్ ని పరీక్షించిన వైద్యులు..అప్పటికే అతను మృతి చెందినట్లుగా నిర్ధారించారు.  గుండెపోటుతోనే యోగేష్ మరణించినట్లుగా తెలిపారు.  కాగా,  పెళ్లి తర్వాత యోగేష్ బాడీ బిల్డింగుకు విరామమిచ్చి పెద్దగా బరువులు ఎత్తడం లేదు.  తక్కువ బరువులు ఎక్కుతున్నాడు.  ఈ క్రమంలో ఒక్కసారిగా భారీ బరువులు ఎత్తడం వల్లే ఇలా జరిగిందని వైద్యులు చెబుతున్నారు.

కోవిడ్ అనంతరం ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రచారంలో ఉన్నప్పటికీ.. ఇటువంటి సంఘటనలు దానివల్ల కాదని కొంతమంది నిపుణులు అంటున్నారు. ఎక్కువగా ఫిట్నెస్ కు ప్రాధాన్యత ఇస్తున్న యువకులు, గుండెపోటు మరణాల బారిన పడడానికి కారణం ఫ్యాట్ కు దూరంగా ఉండటమేనని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. 

click me!