జైలుకు వెళ్లే వాళ్ల వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవరసం లేదు.. ఎంపీ రఘురామ కృష్ణరాజు

By Sumanth KanukulaFirst Published Jan 1, 2022, 10:00 AM IST
Highlights

కన్సార్షియం నుంచి రుణాలు తీసుకుని ఎగ వేసిన ఆరోపణలపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుతో (MP Raghu Ramakrishna Raju) పాటు మరో 15 మంది‌పై సీబీఐ చార్జీషీట్ (CBI Chargesheet) దాఖలు చేసిన సంగతి తెలిసిందే. . సీబీఐ తనపై చార్జీషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో రఘరామ కృష్ణరాజు స్పందించారు. 

కన్సార్షియం నుంచి రుణాలు తీసుకుని ఎగ వేసిన కేసులో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుతో (MP Raghu Ramakrishna Raju) పాటు మరో 15 మంది‌పై సీబీఐ చార్జీషీట్ (CBI Chargesheet) దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన 15 మందిలో ఆయన కంపెనీ, అనుబంధ కంపెనీలు, కాంట్రాక్టర్లు, చార్టెడ్ అకౌంట్లు ఉన్నారు. సీబీఐ తనపై చార్జీషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో రఘరామ కృష్ణరాజు స్పందించారు. తనపై చార్జీషీట్ ఈ సమయంలో నమోదు కావడం శుభపరిణామాని అన్నారు. అన్ని అంశాలపై కోర్టుకు సమాధానం ఇస్తానని ఆయన చెప్పారు. రేపో, మాపో జైలుకు వెళ్లే వాళ్ల వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవరసం లేదని తెలిపారు. 

సీబీఐ చార్జీషీట్ ప్రకారం.. 2018లో హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ, దాని డైరెక్టర్లతో సహా ఐదుగురు నిందితులపై ఢిల్లీ పోలీసులు ఆర్థిక నేరాల విభాగం కేసును నమోదు చేసింది. 2019 ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు సీబీఐ ఆ కేసు దర్యాప్తును చేపట్టింది. ఈ క్రమంలోనే ఎంపీ రఘురామ కృష్ణరాజు చైర్మన్ గా ఉన్న ఇండ్ భారత్ గ్రూప్ (Ind Barath group) తమిళనాడు ట్యుటికోరిన్‌లో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థను నెలకొల్పుతామంటూ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎఫ్‌సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఆర్ఈసీ), ఇండియా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్  (ఐఐఎఫ్ సీఎల్)తో కూడిన కన్సార్టియం నుంచి దాదాపు రూ. 947.71 కోట్ల రుణం తీసుకుంది. అయితే రుణగ్రహీత ఆ పనిని పూర్తి చేయలేదని సీబీఐ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ఇండ్ భారత్ పవర్ మద్రాస్ లిమిటెడ్‌కు అప్పడి సీఎండీగా ఉన్న రఘరామ కృష్ణరాజు, డైరెక్టర్ మధుసూదనరెడ్డిలను సీబీఐ నిందితులుగా చేర్చింది. 

Also Read: ఎంపీ రఘురామకృష్ణరాజు సహా 16 మందిపై సీబీఐ ఛార్జిషీట్...

ఒప్పందం నిబంధనలు పాటించలేదు. తాము తీసుకున్న రుణాలను నిందితులు, సదరు కంపెనీ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో మళ్ళించడంతోపాటు గుత్తేదారులకు అడ్వాన్సుగా చెల్లించారు. పైగా తాము ఫిక్స్ డ్ చేసిన మొత్తం నుంచి రుణాలు తీసుకున్నారు. గ్రూప్ పరిధిలోని ఇతర కంపెనీల గుత్తేదారులకు అడ్వాన్సులు చెల్లించారు. తీసుకున్న రుణాలు చెల్లించక పోవడంతోపాటు ఫిక్స్ డ్ డిపాజిట్లను రుణ ఖాతాలకు సర్దుబాటు చేయడంతో  రుణాలు ఇచ్చిన కంపెనీలు నష్టపోయాయి.

థర్మల్ కంపెనీ ఏర్పాటు పేరుతో ఇండ్ భారత్ కంపెనీ, ఇతర నిందితులు తో కలిసి అక్రమంగా నిధులు వాడుకోవడంతో పాటు నిజాయితీగా వ్యవహరించకపోవడంతో కన్సార్షియం రూ.947.71 కోట్లు నష్టపోవడానికి కారణం అయింది అని సీబీఐ పేర్కొంది. 

సీబీఐ చార్జ్‌షీటు జాబితాలో..
ఇండ్‌ భారత్‌ పవర్‌ మద్రాస్‌ లిమిటెడ్‌ కంపెనీ సీఎండీ రఘరామ కృష్ణరాజు, డైరెక్టర్ మధుసూదన్‌ రెడ్డి, సోకేయి పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ వై నాగార్జున రావు, ఇండ్ భారత్ గ్రూప్స్ చార్టెడ్ అకౌంటెంట్ సి వేణు, ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్స్.. ఎం శ్రీనివాసులు రెడ్డి, ప్రవీణ్ కుమార్ జబద్, భారత్‌ పవర్‌ మద్రాస్‌ లిమిటెడ్‌ కంపెనీతో పాటుగా సిస్టర్ కంపెనీలుగా ఉన్న.. ఇండ్‌ భారత్‌ పవర్‌ ఇన్ఫ్రా లిమిటెడ్‌, ఆర్కే ఎనర్జీ (రామేశ్వరం) లిమిటెడ్‌,  శ్రీబా సీబేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఇండ్‌ భారత్‌ పవర్‌ జెన్‌కామ్‌ లిమిటెడ్‌, ఇండ్‌ భారత్‌ ఎనర్జీ ఉత్కళ్‌ లిమిటెడ్‌, ఇండ్‌ భారత్‌ పవర్‌ కమాడిటీస్‌ లిమిటెడ్‌, ఇండ్‌ భారత్‌ ఎనర్జీస్‌ మహారాష్ట్ర లిమిటెడ్‌, ఇండ్‌ భారత్‌ థర్మల్‌ పవర్‌ లిమిటెడ్‌, సోకేయి పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌‌లను నిందితులుగా పేర్కొంది. 
 

click me!