పదేళ్ల పిల్లాడి నోటి నుంచి 30 దంతాలు తొలగించారు..!

Published : Mar 01, 2022, 09:44 AM IST
పదేళ్ల పిల్లాడి నోటి నుంచి 30 దంతాలు తొలగించారు..!

సారాంశం

నోటి నిండా పళ్లు ఉండటంతో.. ఆ బాలుడు చాలా ఇబ్బంది పడుతూ వచ్చాడు. అందుకే అతని నోట్లో నుంచి దాదాపు 30 పళ్లు పీకేశారు. 

సాధారణంగా  ఒక మనిషికి ఎన్ని దంతాలు ఉంటాయి..?  టక్కున 32 అని చెబుతారు. కానీ ఓ పదేళ్ల పిల్లాడి నోట్లో 50 దంతాలు ఉన్నాయి. నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. నోటి నిండా పళ్లు ఉండటంతో.. ఆ బాలుడు చాలా ఇబ్బంది పడుతూ వచ్చాడు. అందుకే అతని నోట్లో నుంచి దాదాపు 30 పళ్లు పీకేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అరుదైన, సంక్లిష్టమైన ఒడోంటోమా వ్యాధితో బాధపడుతున్న 10 ఏళ్ల వయస్సు గల బాలుడు నోటి లో నుంచి  30 వికృతమైన దంతాలను తొలగించినట్లు వైద్యులు తెలిపారు.

బాలుడు గత కొంత కాలంగా ఒడోంటోమా అనే వ్యాధితో బాధపడుతున్నారు. నోటి నిండా పళ్లు ఉండటం ఈ వ్యాధి లక్షణం. దీని కారణంగా బాలుడు దీర్ఘకాలిక వాపు , దంతాల నొప్పితో బాధపడుతున్నాడు. ఓడోంటోమా కారణంగా అతని నోటిలో 50 పళ్ళు ఉన్నట్లు పరీక్షలో తేలిందని ప్రైవేట్ మోడరన్ డెంటల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన సచిన్ ఠాకూర్ తెలిపారు.

"లక్ష జనాభాలో ఒకటి లేదా రెండు కేసులు మాత్రమే కనిపిస్తాయి. సకాలంలో పరిష్కరించకపోతే సమస్య సంక్లిష్టంగా మారుతుంది. ముగ్గురు సభ్యుల బృందం రెండున్నర గంటలపాటు నిర్వహించిన శస్త్రచికిత్సలో బాలుడి 30 దంతాలను తొలగించింది. అతను 18 సంవత్సరాల వయస్సులోపు 30 దంతాలను తిరిగి పొందుతాడు," అని  వైద్యులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Earth 5 Major Risks : థర్డ్ వరల్డ్ వార్ కాదు.. అంతకంటే పెద్ద ముప్పు భూమికి రాబోతోంది
PM Modi in Bodo Cultural Programme: బోడో సాంస్కృతిక కార్యక్రమంలో ప్రధాని మోదీ| Asianet News Telugu