
Russia Ukraine Crisis: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం నాడు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపును మరింత వేగవంతం చేసేలా.. అక్కడి పరిస్థితులను సమన్వయం చేయడానికి ఉక్రెయిన్ సరిహద్దులకు పలువురు కేంద్ర మంత్రులు వెళ్లనున్నారు. నేటి సమావేశంలో ప్రధాని మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలు విమానాల్లో భారత పౌరులను కేంద్ర ప్రభుత్వం ఇండియాకు తీసుకువచ్చింది. ఇంకా అక్కడ చాలా మంది చిక్కుకుపోవడంతో వారి పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం నాడు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపును మరింత వేగవంతం చేసేలా.. ఉక్రెయిన్ సరిహద్దులకు పలువురు కేంద్ర మంత్రులు వెళ్లనున్నారు. సోమవారం అర్థరాత్రి మరో విమానం బుకారెస్ట్ నుంచి భారతీయ విద్యార్థులతో బయలుదేరింది. ఆపరేషన్ గంగా కింద ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన 218 మంది భారతీయ పౌరులతో తొమ్మిదో విమానం రోమేనియా రాజధాని బుకారెస్ట్ నుండి న్యూఢిల్లీకి బయలుదేరిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడించారు. "మా తోటి భారతీయులు సురక్షితంగా ఉండే వరకు మేము విశ్రమించము. ఆపరేషన్ గంగా కింద తొమ్మిదో విమానం 218 మంది భారతీయులతో న్యూఢిల్లీకి బుకారెస్ట్ నుండి బయలుదేరింది అని జైశంకర్ వెల్లడించారు.
ఇదిలావుండగా, ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంక్షోభంపై వరుసగా రెండో రోజు కూడా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఉక్రెయిన్ లోని భారతీయ పౌరుల తరలింపు పై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అక్కడి భారత పౌరుల తరలింపు ఎజెండాలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపును మరింత వేగవంతం చేసేలా.. అక్కడి పరిస్థితులను సమన్వయం చేయడానికి ఉక్రెయిన్ సరిహద్దులకు పలువురు కేంద్ర మంత్రులు వెళ్లనున్నారు. నేటి సమావేశంలో ప్రధాని మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజిజు, జనరల్ వీకే సింగ్‌లను తరలింపు కార్యకలాపాలను సమన్వయం చేయడానికి ఉక్రెయిన్ పొరుగు దేశాలకు పంపాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కేంద్ర మంత్రులతో పాటు పలువురు ఉన్నతాధికారులు సైతం వారివెంట వెళ్లనున్నారని సమాచారం. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, విదేశాంగ కార్యదర్శి హరీష్ ష్రింగ్లా, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, న్యాయ, న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లు హాజరయ్యారు. వీలైనంత త్వరగా కేంద్ర మంత్రులు ఉక్రెయిన్ సరిహద్దులకు వెళ్లనున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.