పైశాచికం... యువకుడిని కాళ్లతో తంతూ... కర్రలతో కొడుతూ దాడి.. అనుమానంతో అమానుషం...

Published : Mar 01, 2022, 07:23 AM IST
పైశాచికం... యువకుడిని కాళ్లతో తంతూ... కర్రలతో కొడుతూ దాడి.. అనుమానంతో అమానుషం...

సారాంశం

అనుమానంతో ఓ యువకుడిని చావచితకబాదారు కొందరు వ్యక్తులు. అసలు నేరం చేశాడో లేదో తెలియకుండా అమానుషంగా ప్రవర్తించాడు. వారి ప్రవర్తనతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దారుణ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది...

చెన్నై : stealing bike నెపంతో ఓ యువకుడిని కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టారు. అతడి కర్రలతో కొడుతూ, కాళ్లతో తంతూ పైశాచికత్వం ప్రదర్శించారు. ఈ షాకింగ్ ఘటన Tamil Naduలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెడితే...కరూర్ ప్రాంతంలో ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న అనిష్ (22)ను కొందరు వ్యక్తులు కలిశారు. తమ బైక్ ను అనిష్ దొంగిలించాడనే అనుమానంతో అతడితో మాట్లాడాలనివారు చెప్పారు. అనంతరం కరూర్ జిల్లాలో వీరరక్కియంలోని నిర్మానుష్య ప్రాంతానికి అనిష్ కు బలవంతంగా తీసుకెళ్లారు. 

ఈ క్రమంలో అనిష్ ను వారు బెదిరిస్తూ.. బైకు దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలని బెదిరించారు. ఇదుకు అనిష్ ఒప్పుకోకపోవడంతో 10మంది అడిపై దాడి చేశారు. కర్రలతో కొడుతూ, కాళ్లతో తన్నుతూ, పిడిగుద్దులతో చితకబాదారు. వారిలో ఓ వ్యక్తి ఈ తంతంగాన్ని వీడియో తీశాడు. వారి దాడి చేస్తన్న సమయంలో అనిష్ అరుస్తూ.. తనను పోలీస్ స్టేషన్ కు తరలించాలని వేడుకున్నాడు. కానీ, వారు అదేమీ పట్టించుకోకుండా దాడి చేశారు. ఆ తరువాత అనిష్ ను అతడి ఇంటి దగ్గర వదిలేసి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన తన కొడుకును చూసి అనిష్ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. 

ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 19న ఓ కొడుకు కన్నతల్లిమీదే ఇలాంటి దారుణానికి తెగబడ్డాడు.  నవమాసాలు మోసి కనిపెంచిన motherపై కుమారుడు కర్కశంగా వ్యవహరించాడు. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి పరిధిలో బ్రహ్మానంద పురంలో చోటుచేసుకున్న ఈ దారుణం వివరాలను పోలీసులు తెలిపారు. వృద్దురాలు నాగమణి, ఆమె భర్త వెంకటేశ్వరరావుకు ఏడేళ్ల కిందట అప్పటి government land కేటాయించింది. వారు రెక్కలు ముక్కలు చేసుకుని అందులో houseని నిర్మించుకున్నారు. మూడేళ్ల కిందట కోటేశ్వర రావు చనిపోయినప్పుడు... వేరే గ్రామంలో పనిచేస్తున్న కుమారుడు శేషు.. తన భార్యతో సహా తల్లి ఇంటికి వచ్చాడు .అప్పటి నుంచి ఇక్కడే తిష్ట వేశాడు. 

వృద్ధాప్యంలో తోడు ఉంటున్నాడనుకున్న తల్లి ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. ఆస్తి కోసం నిత్యం తల్లిని కష్టపెట్టే వాడు. స్థానికులు శేషును మందలించినప్పటికీ ప్రవర్తనలో మార్పు రాలేదు. శుక్రవారం శేషు కాలితో తన్నుతో, కర్రతో కొడుతూ, గిన్నెతో దాడి చేస్తూ... తల్లిపై విరుచుకు పడ్డాడు. కొట్టొద్దని అతని తల్లి ఎంతగా వేడుకుంటున్నా కనికరించలేదు. దాడి దృశ్యాలను స్థానికులు వీడియో తీసి వార్డు సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శేషుని అదుపులోకి తీసుకున్నారు. వృద్ధురాలికి కుమారుడితో పాటు కుమార్తె కూడా ఉంది.

కాగా, నిరుడు డిసెంబర్ 31న కడప జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓబులవారిపల్లి మండలంలో Gold jewelry కోసం తల్లిని కుమారుడు murder చేశాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని శివశంకరాపురం గ్రామానికి చెందిన రామయ్య, నరసమ్మ (47) దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు నాగరాజు liquorకి బానిసై నిత్యం కుటుంబసభ్యులతో గొడవపడేవాడు. దీంతో అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.

ఈ క్రమంలో భార్యను తిరిగి ఇంటికి రమ్మని కోరగా.. తాకట్టు పెట్టిన తన బంగారు నగలను విడిపించుకొస్తే కాపురానికి వస్తానని తేల్చి చెప్పింది. ఆ బంగారాన్ని విడిపించేందుకు నాగరాజు తన తల్లి బంగారాన్ని అడిగాడు. దానికి ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన నాగరాజు రోకలిబండతో నరసమ్మ తల మీద బాది హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

PREV
click me!

Recommended Stories

Earth 5 Major Risks : థర్డ్ వరల్డ్ వార్ కాదు.. అంతకంటే పెద్ద ముప్పు భూమికి రాబోతోంది
PM Modi in Bodo Cultural Programme: బోడో సాంస్కృతిక కార్యక్రమంలో ప్రధాని మోదీ| Asianet News Telugu