ఐదేళ్ల కూతురిని నాలుగో అంతస్తునుంచి పడేసి.. తల్లి ఆత్మహత్యాయత్నం.. ఎందుకంటే..

By Bukka SumabalaFirst Published Aug 5, 2022, 1:46 PM IST
Highlights

కన్నకూతురు బుద్దిమాంధ్యంతో ఉండడం తట్టుకోలేకపోయింది ఆ తల్లి. కూతురి భవిష్యత్తు భయపెట్టింది. తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేసింది. దీంతో కూతుర్ని చంపి, తానూ ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. కానీ... 

బెంగళూరు : కర్ణాటక లోని బెంగళూరులో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. సిలికాన్ సిటీ బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌ లో బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న ఐదేళ్ల కూతురిని నాలుగో అంతస్తు మీదినుంచి కిందికి విసిరేసి చంపేసింది కన్నతల్లి. ఆ తరువాత తానూ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఈ లోపు మిగతా ఫ్లాట్స్ లోని వాళ్లు రావడంతో.. ఆమె ప్రయత్నం ఫలించలేదు. దూకబోతున్న ఆమెను వారు గట్టిగా పట్టుకుని రక్షించారు. కూతురిని చంపేసిన విషయం తెలియడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. 

ఈ ఘటన అంతా అపార్ట్ మెంట్ లోని సీసీ టీవీలో రికార్డ్ అయ్యింది. పాపను కిందికి తోయడానికి ముందు.. చాలాసేపు తల్లి.. పాపతో పాటు కారిడార్ లో తిరిగింది. ఆ తరువాత పాపను నెమ్మదిగా రెయిలింగ్ మీదికి ఎక్కించింది. వెంటనే మళ్లీ వెనక్కి తీసుకుని ఎత్తుకుంది. ఆ తరువాత కాసేపటికి మళ్లీ రెయిలింగ్ మీదికి ఎక్కించి.. ఒక్కసారిగా తోసేసింది. ఆ తరువాత తానూ ఆత్మహత్య చేసుకోవడానికి రెయిలింగ్ మీదికి ఎక్కింది. అయితే దూకేముందు కాసేపు అలాగే ఉండిపోవడం, అపార్ట్ మెంట్ లోని వేరేవాళ్లు రావడంతో ఆమెను కాపాడారు. 

చనిపోయిన పాప పేరు దితీ. మానసిక వికలాంగురాలు. తల్లి సుష్మ. వృత్తిరీత్యా డెంటిస్ట్. పాప పరిస్థితితో మానసికంగా తీవ్ర ఆందోళన చెందుతున్న సుష్మ.. మూడు నెలల క్రితం కూడా పాపను వదిలించుకునే ప్రయత్నం చేసింది. చిన్నారిని తీసుకువెళ్లి రైల్వే స్టేషన్ లో వదిలేసి వచ్చింది. అయితే, ఈ విషయం తెలిసి తండ్రి పాపను వెతికి, వెనక్కి తీసుకువచ్చాడు. అతను టీసీఎస్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఈ ఘటన సంపంగి రామనగర్‌లోని అద్విత్‌ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకుంది. తల్లిపై సంపంగిరామనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కూతురు ఆరోగ్యం విషయంలో తీవ్ర డిప్రెషన్ కు లోనయిన కారణంగానే తల్లి ఈ విధంగా చేసిందని తెలుస్తోంది. 

చిన్నారి ప్రాణం తీసిన చైన్ స్నాచర్.. తల్లి పుస్తెలతాడు లాక్కొనే క్రమంలో ఘాతుకం

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే ఆగస్ట్ 1న తెలంగాణలోని జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. జనగామలోని అంబేద్కర్ నగర్ కు చెందిన భాస్కర్, స్వప్న దంపతులకు ఇద్దరు పిల్లలు. మొదటి సంతానం కుమారుడు నవనీత్. రెండో సంతానం కూతురు తేజస్విని. అయితే కూతురు తేజస్వినికి  ఏడాది వయస్సు దాటినా ఆమెలో కదలికలు లేకపోవడం, మాటలు రాక పోవడంతో అచేతనంగానే ఉంటుంది. దంపతులిద్దరూ కూతురు కోసం ఆసుపత్రుల చుట్టూ తిరిగారు.అయితే, పాపకు  భవిష్యత్తులో కూడా కదలికలు వచ్చే అవకాశం లేదని వైద్యులు తేల్చి చెప్పారు. ఇదే సమయంలో కుమారుడు నవనీత్ గుండెలో రంధ్రం ఉండడంతో రూ. ఎనిమిది లక్షలు ఖర్చుచేసి బైపాస్ సర్జరీ చేయించారు.

పుట్టిన ఇద్దరు పిల్లలు అనారోగ్యం బారిన పడడంతో భాస్కర్, స్వప్న తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే తేజస్విని భవిష్యత్తు భారమవుతోందని భావించిన స్వప్న దారుణ నిర్ణయం తీసుకుంది.  సోమవారం ఉదయం 11 గంటలకు.. భర్త ఇంట్లో లేని సమయంలో.. ఇంటి ముందున్న నీటి తొట్టెలో పాపను పడవేసింది. దీంతో ఊపిరాడక చిన్నారి మృతి చెందింది.

పాప హత్య విషయం తన మీదికి రాకుండా ఉండేందుకు స్వప్న ఎవరో దుండగులు ఈ పని చేశాడని  నమ్మించేందుకు ప్రయత్నించింది. గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి, తన పుస్తెలతాడు లాక్కునేందుకు ప్రయత్నించాడని,  వదలకపోయేసరికి పాప తేజస్వినిని ఎత్తుకెళ్లి ఇంటి ముందు నీటిలో సంపులో పడేశాడని చెప్పింది. 

click me!