ఇది కదా తల్లి ప్రేమ అంటే... నెట్టింట వైరల్ అవుతున్న తల్లి కోడి వీడియో...!

Published : Mar 11, 2023, 10:30 AM IST
  ఇది కదా తల్లి ప్రేమ అంటే... నెట్టింట వైరల్ అవుతున్న తల్లి కోడి వీడియో...!

సారాంశం

తాజాగా ఓ తల్లి ప్రేమను కళ్లకు కట్టినట్లు చూపించే వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఇది పాత వీడియోనే కావచ్చు కానీ... చూసిన ప్రతిసారీ... ఎరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది.  

ఈ ప్రపంచంలో గొప్ప ప్రేమ ఏది అంటే ఎవరైనా ముందు తల్లి ప్రేమ అనే చెబుతారు. ఎందుకంటే... తల్లి ప్రేమ నిస్వార్థమైనది. తన కడుపు నిండకపోయినా.. తన బిడ్డ ల కడుపు నిండాలని తల్లి తాపత్రయపడుతుంది. అంతేకాదు.. తన ప్రాణాలు పోతున్నా.. వాటిని పణంగా పెట్టి మరీ తన బిడ్డను కాపాడాలని చూస్తుంది. తాజాగా ఓ తల్లి ప్రేమను కళ్లకు కట్టినట్లు చూపించే వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఇది పాత వీడియోనే కావచ్చు కానీ... చూసిన ప్రతిసారీ... ఎరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది.

 

ఈ వీడియోని ఐఏఎస్ అధికారి డాక్టర్ సుమితా మిశ్రా ని షేర్ చేశారు.  ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అంటే..ఓ తల్లి కోడి భారీ వర్షం నుంచి తన పిల్లలను కాపాడటానికి ప్రయత్నిస్తోంది. తన రెక్కల కింద బిడ్డలను దాచిపెట్టింది. ఈ వీడియోకి ఇప్పటి వరకు 99వేల వ్యూస్ రావడం గమనార్హం.

ఆ భారీ వర్షంలో తాను తడుస్తున్నా.. తన బిడ్డలు తడవకుండా ఉండేందుకు అది చేసిన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటోంది. అమ్మ ఎప్పటికీ అమ్మే అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు