మ్యాట్రిమోనీ సైట్లను ఇలా కూడా వాడేస్తున్నారా..?

Published : Mar 11, 2023, 09:44 AM ISTUpdated : Mar 11, 2023, 09:46 AM IST
 మ్యాట్రిమోనీ సైట్లను ఇలా కూడా వాడేస్తున్నారా..?

సారాంశం

ఎవరైనా నచ్చితే వారితో మాట్లాడి... నెక్ట్స్ స్టెప్ తీసుకుంటారు.  కానీ... కెరీర్ గ్రోత్ కోసం ఎవరైనా మ్యాట్రిమెనీ సైట్స్ వెతుకుతారా...?ఓ యువతి అదే చేసింది. మ్యాట్రిమోనీ సైట్  ని తన కెరీర్ కోసం ఉపయోగించుకుంది. 

పెళ్లీడుకు వచ్చిన వారందరికీ మ్యాట్రిమోనీ సైట్ల గురించి తెలిసే ఉంటుంది. ఎవరైనా మ్యాట్రిమోనీ సైట్లలో ఏం చేస్తారు..? వారి ఫోటో, ప్రొఫైల్ ఉంచి... వారికి తగిన జోడీని వెతుకుతూ ఉంటారు.  ఎవరైనా నచ్చితే వారితో మాట్లాడి... నెక్ట్స్ స్టెప్ తీసుకుంటారు.  కానీ... కెరీర్ గ్రోత్ కోసం ఎవరైనా మ్యాట్రిమెనీ సైట్స్ వెతుకుతారా...?ఓ యువతి అదే చేసింది. మ్యాట్రిమోనీ సైట్  ని తన కెరీర్ కోసం ఉపయోగించుకుంది. అదెలా అనే అంటే.. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి.


అశ్వీన్ బన్సల్ అనే వ్యక్తి... లింక్డ్ ఇన్ లో పోస్టు చేసిన ఓ పోస్టు... అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోందంటూ మొదలుపెట్టాడు. తన స్నేహితులు శాలరీ గ్రోత్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఉపయోగించడం గమనార్హం.  కొందరి ప్రొఫైల్స్ చూస్తే... వారు ఏ  కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారో... వారి జీతం ఎంతో తెలిసిపోతుంది కదా..? దాంతో... ఏ కంపెనీలు ఎలాంటి సాలరీ స్ట్రక్చర్ ఇస్తున్నారనే విషయం తెలిసిపోతుంది. అందుకే.. ఆమె ఈ వివరాలు తెలుసుకునేందుకు మ్యాట్రిమోనీ సైట్ లను ఎంచుకుంది.  తన స్నేహితురాలు  #jeevansathi.comని ప్రజల ప్రొఫైల్‌ల కంపెనీల గురించి తెలుసుకుంటోందని అతను చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఈ లింక్డ్ ఇన్ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. 

 

ఆమె తెలివిని అందరూ ప్రశంసిస్తున్నారు. రెండు రకాలుగా వాడుకోవచ్చని మెచ్చుకుంటున్నారు. ఓ వైపు మంచి జీతం వచ్చే భర్తను ఎంచుకోవడం తోపాటు.. తనకు ఎక్కువ జీతం ఇచ్చే కంపెనీని కూడా ఎంచుకుంటోంది అంటూ.. కామెంట్స్ చేయడం విశేషం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు