భర్తను చంపి, ఇంటిచుట్టూ ఫెన్సింగ్ కు కరెంట్ పెట్టి... మృతదేహంతో 5 రోజుల పాటు ఇంట్లోనే గడిపి.. చివరికి....

Published : Mar 11, 2023, 10:09 AM IST
భర్తను చంపి, ఇంటిచుట్టూ ఫెన్సింగ్ కు కరెంట్ పెట్టి... మృతదేహంతో 5 రోజుల పాటు ఇంట్లోనే గడిపి.. చివరికి....

సారాంశం

జార్ఖండ్ లో ఓ మహిళ దారుణానికి ఒడిగట్టిందో భర్తతో గొడవ జరుగుతుందని అతడిని దారుణంగా హతమార్చింది. ఆ తరువాత మృతదేహాన్ని 5 రోజుల పాటు ఇంట్లోనే పెట్టుకుంది. 

జార్ఖండ్ : మానసిక స్థితి సరిగా లేని ఓ మహిళ ఘాతకానికి పాల్పడింది. తన భర్తను స్వయంగా హత్య చేసింది. ఆ తర్వాత భర్త మృతదేహంతో  ఇంట్లోనే ఐదు రోజులపాటు జీవించింది. అయితే ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కల వారు ఉలిదిప్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో భర్త హత్య విషయం వెలుగుచూసింది. ఈ ఘటన ఝార్ఖండ్లోని జంషేడ్ పూర్ లో జరిగింది. మృతుడిని సుభాష్ కాలనీకి చెందిన అమర్నాథ్ సింగ్ గా పోలీసులు గుర్తించారు. అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి.

అమర్నాథ్ సింగ్  భార్య మీరా. ఆమెకు మానసిక స్థితి సరిగా ఉండదు. . ఈ కారణం తోనే వారిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి.  గొడవల నేపథ్యంలో కోపంతో మీరా ఇంట్లోని వస్తువులను బయటకు విసిరేస్తూ నానాహంగా సృష్టించేది. తరచుగా ఇలాంటి ఘటనలు అలవాటైపోయిన స్థానికులు.. అమర్నాథ్ ఐదు రోజులుగా కనిపించకపోవడం.. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో అనుమానించారు.

ఢిల్లీలో కవిత నిరాహారదీక్ష.. దృష్టి మళ్లించే వ్యూహమే: జైరాం రమేష్

వారు మీరాను ప్రశ్నించగా.. వారిని ఆమె తిడుతూ, అక్కడినుంచి వెళ్లగొట్టింది. అంతేకాదు వారు తమ ఇంట్లోకి రాకుండా ఉండాలని మీరా ఇంటి చుట్టూ ఉన్న కంచెకు కరెంటు పెట్టింది. దీంతో స్థానికులెవ్వరూ ఇంట్లోకి వెళ్లలేకపోయారు. చివరికి ట్రాన్స్ ఫార్మర్  దగ్గర కరెంటును ఆపేసి.. ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా.. అమర్ నాథ్ మృతదేహం కనిపించింది. అమర్నాథ్, మీరాలకు ఓ కుమారుడు ఉన్నాడు. అతను పూణెలో ఉంటున్నాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడం, అమర్ నాథ్ కనిపించకపోవడంతో ఇరుగుపొరుగువారు ఈ విషయాన్ని అతడికి ఫోన్ చేసి తెలిపారు. 

తరువాత, తల్లి చేసిన విషయాన్ని అతడికి మొత్తం తెలియజేశారు. దీంతో అతను అక్కడినుంచే స్థానిక పోలీసులకు ఫోన్ లో సమాచారం అందించాడు. పోలీసులకు సమాచారం అందడంతో వారు వచ్చి.. ఘటన స్థలాన్ని పరిశీలించారు. అమర్ నాథ్ ను చంపిన తరువాత మీరా ఇంటకి తాళం వేసిందని కూడా స్థానికులు తెలిపారు. అమర్నాథ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మీరాను అదుపులోకి తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు