
జార్ఖండ్: ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు గొడవలకు దిగడం, పరస్పరం కొట్టుకోవడం చూస్తుంటాం. అయితే, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఓ యువకుడి కోసం ఇద్దరు అమ్మాయిలు నడిరోడ్డుపై గొడవ పడ్డారు. పరస్పరం కొట్టుకున్నారు.
బాయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరు అమ్మాయిలు నడిరోడ్డుపై ఘర్షణకు దిగిన సంఘటన జార్ఖండ్ లో చోటు చేసుకుంది. తన బాయ్ ఫ్రెండ్ మరో యువతితో తిరగడాన్ని అమ్మాయి సహించలేకపోయింది. తోక తొక్కిన పాములా బుస కొట్టింది. మార్కెట్ లో అందరూ చూస్తుండగానే యువతి జుట్టు పట్టుకుంది, పిడిగుద్దలు కురిపించింది.
ఆ అమ్మాయి కూడా ఓ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆమె ఎదురు దాడికి దిగింది. ఇద్దరు అమ్మాయిలు ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఇది చూసిన వారు ముక్కు మీద వేలేసుకున్నారు
విషయం తెలిసి పోలీసులు అక్కడికి చేరుకోవడం యువతులతో పాటు యువకుడు కాళ్లకు పని చెప్పారు. అక్కడి నుంచి ఉడాయించారు. జార్ఖండ్ లోని సరాయకేలాలో జరిగి ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోను చూసిన నెటిజన్లు ముక్కు మీద వేలేసుకుంటున్నారు.