ఇండియాలో గత 24 గంటల్లో 40,120 కొత్త కేసులు: 3.13 కోట్ల మంది రికవరీ

Published : Aug 13, 2021, 10:06 AM IST
ఇండియాలో  గత 24 గంటల్లో 40,120 కొత్త కేసులు:  3.13 కోట్ల మంది రికవరీ

సారాంశం

ఇండియాలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతోంది.అంతకు ముందు రోజుతో పోలిస్తే  నిన్న కొత్త కేసుల నమోదు స్వల్పంగా తగ్గింది.  నిన్న ఒక్క రోజే 40,120, కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో 585 మరణించారు.


న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి.. నిన్న  40,120 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజుతో పోలిస్తే కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. క్రితం రోజుతో పోలిస్తే నిన్న నమోదైన కేసుల్లో 2.6 శాతం తగ్గుదల నమోదైందని ఐసీఎంఆర్ తెలిపింది.

దేశంలో మొత్తం కేసులు 3.21 కోట్లుగా నమోదైంది. కరోనా కేసుల వ్యాప్తిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది.నిన్న 19,70,495 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో 40,120 మందికి కరోనా సోకిందని ఐసీఎంఆర్ ప్రకటించింది. కరోనాతో దేశ వ్యాప్తంగా 4,30, 254 మంది  మరణించారు.

గత 24 గంటల్లో కరోనా నుండి  42 వేల మంది కోలుకొన్నారు. ఇప్పటివరకు కరోనా నుండి  3.13 కోట్ల మంది కోలుకొన్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇండియాలో కరోనా రికవరీ రేటు 97.46 శాతంగా ఉంది. మరోవైపు దేశంలో ప్రస్తుతం 3,84,227 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే 57,31,574 మంది కరోనా టీకా వేయించుకొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్