మోర్గాన్ స్టాన్లీ నివేదిక: భారత్ దూకుడు.. దశాబ్ద కాలంలో ఆర్థిక వ్యవస్థలో 10 ప్రధాన మార్పులు..

By Sumanth KanukulaFirst Published May 31, 2023, 1:13 PM IST
Highlights

అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్షియల్ పవర్‌హౌస్ మోర్గాన్ స్టాన్లీ తన తాజా నివేదికలో భారతీయ విజయగాథను ప్రశంసించింది. గత 10 సంవత్సరాలలో భారతదేశం సాధించిన వృద్ధిని హైలెట్ చేసింది.

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్షియల్ పవర్‌హౌస్ మోర్గాన్ స్టాన్లీ తన తాజా నివేదికలో భారతీయ విజయగాథను ప్రశంసించింది. గత 10 సంవత్సరాలలో భారతదేశం సాధించిన వృద్ధిని హైలెట్ చేసింది. భారతదేశం బహుళ విధాన సంస్కరణల ద్వారా గత దశాబ్దంలో ఎలా రూపాంతరం చెందిందో మోర్గాన్ స్టాన్లీ నివేదిక వివరించింది. ప్రస్తుతం ఉన్న భారతదేశం.. 2013లో ఉన్నదానికి భిన్నంగా ఉందని నివేదిక పేర్కొంది. స్థూల మార్కెట్ ఔట్‌లుక్‌కు ‘‘గణనీయమైన సానుకూల పరిణామాలతో’’ పెద్ద మార్పులతో ప్రపంచ క్రమంలో భారతదేశం ఎలా స్థానం సంపాదించిందో నివేదిక హైలైట్ చేసింది.

ఈ నివేదిక గత 25 సంవత్సరాలలో అత్యున్నత పనితీరు కనబరిచిన భారతీయ స్టాక్ మార్కెట్లను సమర్థిస్తుంది. ‘‘ఈక్విటీ విలువలు చాలా గొప్పవి’’ అని పేర్కొంది. మోదీ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మద్దతుగా.. ముఖ్యంగా 2014 నుంచి విధాన మార్పుల కారణంగా గత 10 సంవత్సరాలలో భారతదేశంలో జరిగిన 10 ముఖ్యమైన మార్పులను ప్రస్తావించింది. 

10 ఏళ్లలో భారత్‌లో 10 పెద్ద మార్పులు.. 
1. సరఫరా వైపు విధాన సంస్కరణలు
2. ఆర్థిక వ్యవస్థ యొక్క అధికారికీకరణ
3. రియల్ ఎస్టేట్ (నియంత్రణ, అభివృద్ధి) చట్టం
4. సామాజిక బదిలీలను డిజిటలైజ్ చేయడం
5. దివాలా ,దివాలా కోడ్
6. సౌకర్యవంతమైన ద్రవ్యోల్బణ లక్ష్యం
7. ఎఫ్‌డీఐపై దృష్టి 
8. భారతదేశం 401(కే) పదవీ విరమణ పొదుపు ప్రణాళిక
9. కార్పొరేట్ లాభాల కోసం ప్రభుత్వ మద్దతు
10. బహుళ సంవత్సరాల గరిష్ట స్థాయికి ఎంఎన్‌సీ సెంటిమెంట్

భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా అభివృద్ధి చెందుతోందని.. భవిష్యత్తుకు సానుకూలంగా ఉందని రిపోర్టు పేర్కొంది. తయారీ, ఎగుమతి, వినియోగం, ద్రవ్యోల్బణ సంఖ్యలను స్థిరంగా నిర్వహించడం వంటివి భారతదేశం బలమైన విజయాన్ని సాధించగలదని మోర్గాన్ స్టాన్లీ నిర్ధారించింది. 

click me!