టీకాల కొరతపై ఆరోపణలు.. రాష్ట్రాల వద్దే 84 లక్షల డోసులు: కేంద్రం కౌంటర్

By Siva KodatiFirst Published May 8, 2021, 3:02 PM IST
Highlights

టీకాల కొరతపై రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. కేంద్రం నేడు మరోసారి స్పష్టతనిచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 17.49 కోట్ల డోసులను ఉచితంగా అందించినట్లు వెల్లడించింది.

వ్యాక్సిన్ ఒక్కటే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్‌ను రక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తిదారు టీకా ఉత్పత్తి, పంపిణీ చేయలేక అంతర్జాతీయ సాయం కోసం ఎదురుచూస్తోంది. తమకు టీకాల డోసులు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి.

ఇదే సమయంలో టీకాల కొరతపై రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. కేంద్రం నేడు మరోసారి స్పష్టతనిచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 17.49 కోట్ల డోసులను ఉచితంగా అందించినట్లు వెల్లడించింది.

Also Read:కరోనా సెకండ్ వేవ్ : దేశంలో 24 గంటల్లో 4.01 లక్షల కొత్త కేసులు.. ఢిల్లీలో 4,187 మరణాలు..

ఇందులో 16 కోట్లకు పైగా డోసులను వ్యాక్సిన్ కోసం ఉపయోగించగా.. ఇంకా 84 లక్షలకు పైగా టీకా నిల్వలు రాష్ట్రాల వద్ద వున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.  

మరోవైపు వచ్చే మూడు రోజుల్లో మరో 53,25,000 వ్యాక్సిన్లను రాష్ట్రాలకు పంపుతామని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వద్ద 9.88 లక్షల డోసులు అందుబాటులో ఉండగా.. తమిళనాడులో 7.28 లక్షలు, మధ్యప్రదేశ్‌లో 5.56లక్షలు, మహారాష్ట్రలో 4.52లక్షల డోసులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

అయితే కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో టీకాలు భారీగా నిరుపయోగమైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అక్కడ 22.74 శాతం డోసులు వృథా అయినట్లు తెలిపింది. ఆ తర్వాత హరియాణాలో 6.65శాతం, అస్సాంలో 6.07శాతం, రాజస్థాన్‌లో 5.50 శాతం టీకాల వృథా జరిగినట్లు కేంద్రం వెల్లడించింది. 
 

click me!