
కన్న కూతుర్లపై కామంతో దాడిచేస్తున్న కేసులు రోజురోజుకూ భయాందోళనలు కలిగిస్తున్నాయి. వావి వరసలు మరిచి కన్నకూతుర్లనే బలి తీసుకుంటున్న కామాంధులు పేట్రేగి పోతున్నారు.
కూతురి మీద లైంగిక దాడి చేయద్దన్నందుకు కట్టుకున్న భార్యను బండరాయితో కొట్టి హతమార్చిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
కన్న కూతురిమీద లైంగిక దాడికి పాల్పడొద్దని హెచ్చరించిన భార్యను హతమార్చిన మానవ మృగం మురుగేషన్ (54)కు కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
వివరాల్లోకి వెళితే... పుదుకోట్టై సమీపంలోని తేనిపట్టు కి చెందిన రైతు మురుగేషన్ కు ముగ్గురు భార్యలు, 11 మంది పిల్లలు ఉన్నారు. అయినా అతని కామవాంఛ తీరలేదు.
రెండో భార్య భానుమతి 17 యేళ్ల కుమార్తె మీద అతని కన్ను పడింది. ఆమె మీద మురుగేశన్ లైంగికదాడికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన భార్య అడ్డు చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన మురుగేషన్ భార్య తల మీద బండ రాయితో కొట్టి హత్య చేశాడు. కేసును విచారించిన కోర్టు నిందితుడికి ఉరిశిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించింది.