Coronavirus: దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. నిత్యం లక్షల్లో కరోనా వైరస్ కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే, కరోనా కారణంగా చనిపోతున్న వారిలో టీకా తీసుకోనే వారు అధికంగా ఉంటున్నారని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలో కరోనా కారణంగా చనిపోయిన వారిలో 75 శాతం మంది టీకా తీసుకోని వారే ఉన్నారని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రజైన్ అన్నారు.
Coronavirus: యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ గజగజ వణికిస్తున్నది. 2019లో చైనాలో వెలుగుచూసిన ఈ కోవిడ్ మహమ్మారి అతి తక్కువ కాలంలోనే అన్ని దేశాలకు వ్యాపించింది. నిత్యం అనేక మ్యుటేషన్లకు లోనవుతూ అత్యంత ప్రమాదకారిగా మారుతోంది. ఇదివరకు Coronavirus డెల్టా వేరియంట్ అన్ని దేశాల్లోనూ పంజా విసిరి.. లక్షలాది మంది ప్రాణాలు తీసుకోగా.. ప్రస్తుతం దాని కంటే ప్రమాదకరమైన వేరియంట్ గా భావిస్తున్న ఒమిక్రాన్ విజృంభిస్తోంది. దీంతో మళ్లీ కరోనా బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. భారత్ లోనూ ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కరోనా వైరస్ (Coronavirus) కొత్త కేసులు లక్షల్లో నమోదుకావడం కోవిడ్-19 ఉధృతికి అద్దం పడుతున్నది. మరణాలు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. అయితే, కరోనా టీకాలు తీసుకోనే వారే కోవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని సమాచారం. కరోనా టీకా తీసుకోని వారిలోనే అధికంగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలో కరోనా కారణంగా చనిపోయిన వారిలో 75 శాతం మంది టీకా తీసుకోని వారే ఉన్నారని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రజైన్ అన్నారు.
దేశంలో కరోనా వైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతున్న రాష్ట్రాల్లో ఢిల్లీ కూడా ఒక్కటి. ఇక్కడ నిత్యం వేలల్లోనే కొత్త కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే కరోనా కట్టడి చర్యలకు ఉపక్రమించింది ఢిల్లీ సర్కారు. కరోనా పరిస్థితులపై మీడియాతో మాట్లాడిన ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్.. గత కొన్ని రోజులుగా డిల్లీలో కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నదని అన్నారు. అయితే, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారిలో దాదాపు 75శాతం మంది కోవిడ్ టీకాలు తీసుకోనివారే ఉన్నారని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ అన్నారు. జనవరి 9నుంచి 12 వరకు 97మంది కరోనా వైరస్ కారణంగా చనిపోయారని వెల్లడించిన ఆయన.. వారిలో 70మంది టీకాలు తీసుకోనివారు కాగా.. 19మంది కేవలం తొలిడోసు మాత్రమే తీసుకున్నారని చెప్పారు. వీరిలో 8మంది మాత్రమే రెండు డోసుల కరోనా (Coronavirus) టీకాలు తీసుకున్నారని తెలిపారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ నుంచి రక్షణ పొందగారికి టీకాలు అత్యంత కీలకమనీ, అందరూ వ్యాక్సిన్లు తీసుకోవాలని ప్రజలను కోరారు. అలాగే, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నామనీ, ప్రజలకు వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఢిల్లీ ఆస్పత్రుల్లో ప్రస్తుతం 13వేలకు పైగా బెడ్స్ ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
కాగా, దేశరాజధాని ఢిల్లీలో కొత్తగా 24,383 మంది కరోనా (Coronavirus) బారినపడ్డారు. దీంతో అక్కడ మొత్తం కేసులు 16,70,966కు చేరాయి. అలాగే, 34 మంది వైరస్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో మొత్తం కరోనా వైరస్ కారణండా చనిపోయిన వారి సంఖ్య 25,305కు పెరిగింది. ప్రస్తుతం 92,273 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా (Coronavirus) బారినపడ్డవారిలో ఇప్పటివరకు 15,53,388 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా కూడా కరోనా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా 2.68 లక్షల కేసులు నమోదయ్యాయి.