చల్లటి కబురు.. జూన్ 4న కేరళకు రుతుపవనాలు.. ఎల్ నినో వాతావరణ పరిస్థితి ఉన్నప్పటికీ సాధారణ వర్షాలు..

By Asianet NewsFirst Published May 26, 2023, 1:44 PM IST
Highlights

రుతుపవనాలు జూన్ 4వ తేదీన కేరళను తాకనున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొంది. 

ఎండలు, ఉక్కపోతలతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. జూన్ 4వ తేదీన రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయని అంచనా వేసింది.  జూన్ 1వ తేదీ లోపు రుతుపవనాలు వచ్చే అవకాశం లేదని ఐఎండీ తెలిపింది.  

తెరపైకి తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం.. నాకు కనీస ఆహ్వానం అందలేదన్న గవర్నర్ తమిళసై.. ఏమైందంటే ?

ఈ మేరకు ఐఎండీ ట్వీట్ చేస్తూ.. ‘‘రుతుపవనాలు బలంగా ఏర్పడిన తర్వాతే జూన్ 4 నాటికి కేరళలోకి ప్రవేశిస్తాయి. జూన్ 1వ తేదీ లోపు రుతుపవనాలు వస్తాయని ఆశించడం లేదు. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగా ఉండే అవకాశం ఉంది.’’ అని పేర్కొంది.

Once the monsoon will get established strong, we are expecting the monsoon to arrive in Kerala around 4th June. Before 1st June, we are not expecting monsoon to arrive. Monsoon most likely to be normal this year: IMD pic.twitter.com/9YlMw903g3

— ANI (@ANI)

వచ్చే వారం వరకు అరేబియా సముద్రంలో తుఫాను వచ్చే అవకాశం లేదని ఐఎండీ తెలిపింది. ‘‘వర్షపాతం పంపిణీ దాదాపు అన్ని చోట్లా ఒకేలా ఉంటే, అది అనువైన పరిస్థితి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్ని చోట్లా సమాన పంపిణీ జరిగితే వ్యవసాయంపై పెద్దగా ప్రభావం ఉండదు. వాయవ్య భారతంలో ప్రస్తుతానికి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది’’ అని పేర్కొంది. 

ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ కు ఆరు వారాల పాటు బెయిల్..

ఎల్ నినో వాతావరణ పరిస్థితి తలెత్తినప్పటికీ 2023 లో భారతదేశంలో సాధారణ రుతుపవనాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది. ఆసియాలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ లో వ్యవసాయం, మొత్తం ఆర్థిక వృద్ధికి అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. సాధారణంగా జూన్ 1న కేరళలో వర్షాలు కురిసి సెప్టెంబర్ నాటికి వెనక్కి తగ్గుముఖం పడతాయని, ఈ ఏడాది దీర్ఘకాలిక సగటులో 96 శాతం ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సీనియర్ అధికారి డీఎస్ పాయ్ మీడియాతో తెలిపారు. 
 

click me!