నిజమైన ప్రేమ అంటే ఇదేనేమో..?

Published : May 26, 2023, 01:20 PM IST
నిజమైన ప్రేమ అంటే ఇదేనేమో..?

సారాంశం

 ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో ని గుర్పిందర్ సంధు అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు ఈ వీడియోకి 2 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం.  

ఇంటర్నెట్  అందుబాటులోకి వచ్చిన తర్వాత  ప్రపంచంలో ఎక్కడెక్కడో జరిగే వీడియోలు మన ముందుకు వచ్చేస్తున్నాయి. అందులో కొన్ని వీడియోలు మన మనసుల్ని మెలిపెట్టేస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అందులో ఓ పెద్దాయన తన భార్యపై ఉన్న ప్రేమను చాలా అద్భుతంగా తెలియజేశాడు.

ఈ వీడియో చూసినవారు ఎవరైనా కంటతడి పెట్టించగలదు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో ని గుర్పిందర్ సంధు అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు ఈ వీడియోకి 2 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం.


ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను గుర్పిందర్ ఒక రోజు క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. క్లిప్‌లో, రోడ్డు పక్కన ఉన్న దుకాణం నుండి ఒక వృద్ధుడు షర్బత్ తీసుకుంటూ కనిపించాడు. అతను తన సైకిల్‌పై ఉన్నాడు. ఒక చేతిలో అతని దివంగత భార్య ఫోటో  ఉంది. అతను షర్బత్ తాగే ముందు, గ్లాసుని భార్య ఫోటోకి చూపించాడు. ఆ తర్వాత అతను తాగడం విశేషం. చిపోయిన తర్వాత కూడా భార్యపై అతను చూపించిన ప్రేమకు అందరూ ఫిదా అయిపోతున్నారు.  చాలా మంది ఈ వీడియో చూసి కన్నీళ్లు పెట్టుకోవడం విశేషం. నిజమైన ప్రేమ అంటే ఇదే కదా అని కొందరు కామెంట్స్ చేయడం విశేషం.

"నిజమైన ప్రేమ అంటే ఏమిటి అని ఎవరైనా నన్ను అడిగినప్పుడు, నేను ఈ అందమైన క్లిప్‌ను చూపిస్తాను" అని ఒక నెటిజన్ కామెంట్ చేయడం విశేషం.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !