Monkeypox : మంకీపాక్స్ టెస్ట్ కోసం ఆర్టీ-పీసీఆర్ కిట్ ను త‌యారు చేసిన చెన్నై కంపెనీ..

Published : May 28, 2022, 01:48 PM IST
Monkeypox : మంకీపాక్స్ టెస్ట్ కోసం ఆర్టీ-పీసీఆర్ కిట్ ను త‌యారు చేసిన చెన్నై కంపెనీ..

సారాంశం

మంకీపాక్స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో చెన్నైకి చెందిన కంపెనీ ఓ ఆర్టీపీసీఆర్ కిట్ ను డెవ‌ల‌ప్ చేసింది. దీని ద్వారా ఒక గంట‌లో ఫ‌లితం తెలుసుకోవ‌చ్చు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలిపిన ప్ర‌మాణాలకు అనుగుణంగా దీనిని రూపొందించారు. 

మంకీపాక్స్ వ్యాప్తిపై ప్ర‌పంచ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు పెరుగుతున్నాయి. రోజు రోజుకు పలు దేశాల్లో ఈ వైర‌స్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 20 దేశాల్లో ఈ వైర‌స్ ను గుర్తించామ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ నేప‌థ్యంలో ఈ వైర‌స్ ను గుర్తించేందుకు త‌మిళ‌నాడు రాష్ట్రంలోని చెన్నైకు చెందిన కంపెనీ ఆర్టీ-పీసీఆర్ టక‌టిన్ ను అభివృద్ధి చేసింది. ఈ మేర‌కు ఆ సంస్థ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 

Language war: పెళ్లి బరాత్‌లో కన్నడ పాటలకు డ్యాన్స్ చేస్తున్నారని దాడి.. మహారాష్ట్ర, కర్ణాటక బార్డర్‌లో ఘటన

చెన్నైకి చెందిన వైద్య పరికరాల సంస్థ ట్రివిట్రాన్ హెల్త్‌కేర్ సంస్థ ఈ టెస్ట్ కిట్ ను రూపొందించింది. Monkeypox Real-Time PCR కిట్ అనేది నాలుగు రంగుల ఫ్లోరోసెన్స్ ఆధారిత కిట్. ఇది మశూచి, మంకీపాక్స్ మధ్య ఒక ట్యూబ్ సింగిల్ రియాక్షన్ ఫార్మాట్‌లో తేడాను గుర్తించగలదని ఆ సంస్థ శుక్ర‌వారం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. 

టెస్ట్ కిట్ వైరస్‌ను గుర్తించడానికి (ఒకవేళ ఉంటే) ఒక గంట సమయం పడుతుంది. ‘‘ మంకీపాక్స్ వైరస్ ను గుర్తించడానికి ట్రైవిట్రాన్ హెల్త్ కేర్ అండ్ డెవలప్ మెంట్ టీమ్ టీమ్ ఆర్టీ-పీసీఆర్ ఆధారిత కిట్ ను అభివృద్ధి చేసింది. త్రివిట్రాన్ మంకీపాక్స్ రియల్-టైమ్ పిసిఆర్ కిట్ నాలుగు కలర్ ఫ్లోరోసెన్స్ ఆధారిత కిట్. ఇది మశూచి మంకీపాక్స్ మధ్య ఒక-ట్యూబ్ సింగిల్ రియాక్షన్ ఫార్మాట్ లో తేడాను చూపుతుంది. మొత్తం టర్న్అరౌండ్ సమయం ఒక గంట‌. ’’ అని ఆ ప్రకటనలో సంస్థ స్పష్టం చేసింది. 

పెళ్లి పేరుతో 300 మంది మహిళలను మోసగించి.. కోట్టు కొల్లగొట్టిన.. సైబర్ వరుడు అరెస్ట్..

ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరిగాయని, 20 దేశాల్లో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 200కు చేరుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం తెలిపింది. ‘‘ మా వద్ద 200 ధృవీకరించబడిన కేసులు, 100 కి పైగా అనుమానిత కేసులు ఉన్నాయి. కానీ ఆ సంఖ్య పెరుగుతుందని మేము ఆశిస్తున్నాము. ఇది 20కి పైగా దేశాలలో, నాలుగు డబ్ల్యూహెచ్ఓ ప్రాంతాలలో ఉంది’’ అని డబ్ల్యూహెచ్ఓ అత్యవసర వ్యాధుల యూనిట్ లో కోవిడ్ -19 రెస్పాండింగ్ టెక్నికల్ లీడ్ మరియా వాన్ కెర్ఖోవ్ చెప్పారు.

డబ్లూహెచ్ వో ఉన్న‌త అధికారి ప్రకారం.. ‘‘ స్థానికేతర ప్రాంతాలలో కనుగొనబడిన మంకీపాక్స్ కేసులు చాలా వరకు పురుషులతో లైంగిక సంబంధం కలిగి ఉన్న పురుషుల జనాభాలో ఉన్నాయి, అయితే ఇది ఆ సమూహానికి మాత్రమే ప్రత్యేకం కానవసరం లేదు. ’’ అని తెలిపారు.

ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్‌కు భారత్ చివాట్లు.. యాసిన్ మాలిక్ ను స‌మ‌ర్థించ‌కూడ‌ద‌ని సూచ‌న

మంకీపాక్స్ అనేది ఎలుకలు, ప్రైమేట్స్ వంటి అడవి జంతువులలో ఉద్భవించే వైరస్. అప్పుడప్పుడు మనుషులకు సోకుంతుంది. ఇది మశూచి మాదిరిగానే అదే కుటుంబానికి చెందిన‌ది. 1958లో పరిశోధనా కోతులలో పాక్స్ లాంటి వ్యాధి విజృంభించినప్పుడు శాస్త్రవేత్తలు దీనిని మొట్టమొదట గుర్తించారు. అందుకే దీనికి కోతులకు సంబంధించిన పేరు వచ్చింది. 1970లో కాంగోలోని మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక యువకుడికి మొదటిసారిగా సోకింది.

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?