బెంగాల్ గవర్నర్‌గా మణిపూర్ గవర్నర్‌కు అదనపు బాధ్యతలు.. జగదీప్ ధన్‌కర్ రాజీనామాతో రాష్ట్రపతి ఆదేశం

Published : Jul 18, 2022, 04:47 AM IST
బెంగాల్ గవర్నర్‌గా మణిపూర్ గవర్నర్‌కు అదనపు బాధ్యతలు.. జగదీప్ ధన్‌కర్ రాజీనామాతో రాష్ట్రపతి ఆదేశం

సారాంశం

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు తీసుకోవాలని మణిపూర్ గవర్నర్ లా గణేషన్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్‌ను ఎంచుకోవడంతో ఆయన బెంగాల్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు.  

న్యూఢిల్లీ: వచ్చే నెల జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్డీయే తమ అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా వ్యవహరించిన జగదీప్ ధన్‌కరర్‌ను ఎంచుకుంది. ఉప రాష్ట్రపతిగా ఎంచుకోవడంతో ఎన్డీయే నిర్ణయాన్ని అంగీకరించి పశ్చిమ బెంగాల్ గవర్నర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్వీకరించారు. అనంతరం, పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు తీసుకోవాలని మణిపూర్ గవర్నర్ లా గణేషన్‌కు ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమ బెంగాల్‌కు గవర్నర్‌ను నియమించే వరకు అదనపు బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు.

జగదీప్ ధన్‌కర్ రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్వీకరించినట్టు రాష్ట్రపతి భవన్ ఆదివారం రాత్రి ఓ ప్రకటనలో వెల్లడించింది. మణిపూర్ గవర్నర్ లా గణేషన్‌కు బెంగాల్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించినట్టు ఆ ప్రకటన పేర్కొంది.

ఇదిలా ఉండగా, ప్రతిపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా ఎంపికయ్యారు. 17 ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఆమెను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. వచ్చే నెల 6వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నిక జరుగుతంది. విపక్ష నేతలు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో భేటీ అయ్యారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా 80 ఏళ్ల మార్గరెట్ అల్వాను బరిలోకి దించుతున్నట్టు పవార్ వెల్లడించారు. తనను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ మార్గరెట్ అల్వా కూడా ఈ ఎంపికను ధ్రువీకరించారు. 

ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే ఇప్పటికే జగదీప్ ధన్‌కర్‌ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఉప రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకునే మెజార్టీ ఎన్డీయేకు ఉన్నది. తాజాగా, ప్రతిపక్షాలు తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ అల్వాను ప్రకటించాయి.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..