అంబానీ పార్టీలో ఫుడ్‌తో టిష్యూకు బదులు కరెన్సీ నోట్లు? ఆ వైరల్ ట్వీట్ ఏం చెబుతున్నదంటే?

By Mahesh K  |  First Published Apr 3, 2023, 2:36 PM IST

అంబానీల ఇంట విందు జరిగితే.. అక్కడ ఫుడ్‌తో టిష్యూ పేపర్లు కాకుండా కరెన్సీ నోట్లు ఇస్తారని ఓ యూజర్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ఫుల్ వైరల్ అయింది. ఈ ట్వీట్ నేపథ్యంలో చర్చ మొదలైంది. అవి నిజంగా కరెన్సీ నోట్లేనా? అనే చర్చ జరిగింది. కొందరు ఆ డిజర్ట్ గురించి తెలిసినవారు వివరణలూ ఇచ్చారు.
 


న్యూఢిల్లీ: సంపన్నులైన అంబానీల ఇంటి ఏ విందు జరిగినా అది ఆసక్తిని రేకెత్తిస్తుంది. మరే ఈవెంట్ నిర్వహించినా మీడియాలో అదో హెడ్‌లైన్ అయిపోతుంది. ధనిక కుటుంబం ఎలా పార్టీ నిర్వహిస్తుంది? ఎన్ని హంగులు ఉన్నాయి? ఆడంబరాలను గురించి ఆరా తీస్తుంటారు. అందుకే వారి పార్టీ గురించి ఏ ఫొటో బయటకు వచ్చినా.. ఏ ముచ్చట వచ్చినా.. దానిపై చర్చ జరుగుతూ ఉంటుంది. తాజాగా, ఇదే కోవలోకి వచ్చే ఓ ట్వీట్ తెగ వైరల్ అయింది.

రతనిశ్ అనే ట్విట్టర్ యూజర్ ఓ ట్వీట్ చేశాడు. సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఓ ఫుడ్ ఐటమ్ పిక్‌ను అతను పోస్టు చేశాడు. ఆ ఫుడ్ ఐటమ్‌తోపాటు కరెన్సీ నోట్లూ పెట్టి కనిపించాయి. వాటిని పేర్కొంటూ.. రతనీశ్ ఆ ఫొటోకు ఓ క్యాప్షన్ పెట్టాడు. అంబానీ పార్టీలో ఫుడ్ ఐటమ్‌తో టిష్యూ పేపర్‌కు బదులు రూ. 500 నోట్లు ఉంటాయి.. అని రాసుకున్నాడు. ఈ ట్వీట్ వైరల్ అయిపోయింది. చాలా మంది ఆ విధానంపై చర్చించారు. కొందరు అది తప్పని వాదిస్తుండగా.. ఇంకొందరు వారికి సమాధానం ఇచ్చారు. ఇంతకీ నిజంగా అంబానీల పార్టీలో టిష్యూ పేపర్లకు బదులు కరెన్సీ నోట్లను అతిథులకు ఇచ్చారా? దీనికి సమాధానం ‘కాదు’.

Ambani ji ke party mein tissue paper ki jagah 500 ke notes hote hain 😭 pic.twitter.com/3Zw7sKYOvC

— R A T N I S H (@LoyalSachinFan)

Latest Videos

ఆ ఫొటోను చూస్తే అది కేవలం జోక్ అని అర్థమైపోతుంది. ఢిల్లీ వాస్తవ్యులకు ఇది తొందరగానే బోధపడుతుంది. ఎందుకంటే.. ఢిల్లీలో ఓ రిచ్ డైనింగ్ అందించే ఇండియన్ అస్సెంట్ అనే రెస్టారెంట్‌లో అందించే డిష్ అది. ఈ డిష్ పేరు దౌలత్ కీ చాట్. ఈ డిష్‌ను అంబానీ పార్టీలో సర్వ్ చేసి ఉండొచ్చు.

Wait notes ko damage karna allowed hai?? Koi law nahi hai iske upar?

— Sanskar Sanganeria (@Cricandcine)

Bro it's daulat ki chat from indian accent , those arent real money this is how they serve it in the restaurant as well. pic.twitter.com/8ZFZSdnRiV

— S L I M S H A D Y (@Althaf_tesla369)

ఇండియన అస్సెంట్ రెస్టారెంట్ దౌలత్ కీ చాట్ అనే డిజర్ట్ అందిస్తున్నది. దీన్ని డిజర్ట్ ఆఫ్ ది రిచెస్ అని కూడా పిలుస్తారు. ఈ డిజర్ట్ అందించే కప్‌లో ఫేక్ కరెన్సీ నోట్లనూ పెట్టి రిచ్‌గా ప్రొజెక్ట్ చేస్తారు. కాబట్టి, డిజర్ట్‌తో కనిపిస్తున్నవి నిజమైన కరెన్సీ నోట్లు కావు. అవి ఫేక్ కరెన్సీ నోట్లు. 

Also Read: గాడిద పాల సబ్బులు మహిళలను అందంగా ఉంచుతాయి.. క్లియోపాత్రా వాడేది: మేనకా గాంధీ వ్యాఖ్యలు వైరల్

ఏదేమైనా ఆ ట్వీట్ మాత్రం ఫుల్ వైరల్ అయింది. అది నిజమైన కరెన్సీ అని భ్రమపడ్డవారికి కొందరు ఆ డిజర్ట్ గురించి తెలిసినవారు వివరణలు ఇచ్చారు.

click me!