స్టాలిన్ ను సీఎంగా చూస్తానంటున్న మోహన్ బాబు

By rajesh yFirst Published Aug 27, 2018, 12:50 PM IST
Highlights

డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌ను తొందర్లేనే తమిళనాడు ముఖ్యమంత్రిగా చూస్తానని ప్రముఖ నటుడు మోహన్‌బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

చెన్నై: డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌ను తొందర్లేనే తమిళనాడు ముఖ్యమంత్రిగా చూస్తానని ప్రముఖ నటుడు మోహన్‌బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 ఆదివారం కోయింబత్తూరులో స్టాలిన్‌ తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సంస్మరణ సభ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. కరుణానిధి సంస్మరణ సభకు హాజరుకావాలని  స్టాలిన్‌..మోహన్‌బాబును ఆహ్వానించారు. ఈ విషయాన్ని మోహన్‌బాబు తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

 

కోయింబత్తూరులో నిర్వహించనున్న మాజీ సీఎం కరుణానిధి సంస్మరణ సభకు నన్ను ఆహ్వానించినందుకు నా సోదరుడు స్టాలిన్‌కు ధన్యవాదాలు. మీకు శుభం కలగాలని కోరుకుంటున్నాను. త్వరలో మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూస్తానని ఆశిస్తున్నాను అని ట్వీట్‌ చేస్తూ స్టాలిన్‌తో కలిసి దిగిన ఫొటోలను పంచుకున్నారు.

 

ఇప్పటికే కరుణానిధి మృతితో ఖాళీ అయిన డీఎంకే అధ్యక్ష పదవి చేపట్టడానికి స్టాలిన్‌ రంగం సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా స్టాలిన్ ఆదివారం చెన్నైలోని తమ పార్టీ ప్రధాన కార్యాలయంలో అధ్యక్ష పదవి కోసం నామినేషన్‌ దాఖలు చేశారు. డీఎంకే కోశాధికారి పదవికి ఆ పార్టీ సీనియర్‌ నేత ఎస్‌.దురై మురుగన్‌ నామినేషన్ వేశారు. ఈ పదవులకు ఇతరులెవరూ నామినేసన్ వేయకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. 

click me!