2024 లోక్‌సభ ఎన్నికల్లో మోడీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి రాహుల్ గాంధీ కాదు.. మరి ఎవరు? తాజా సర్వే..

By Mahesh RajamoniFirst Published Feb 3, 2023, 11:41 AM IST
Highlights

New Delhi: లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం మాత్రమే మిగిలి ఉండగా, భారతదేశంలోని ప్రజలు నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నట్లు ఇండియా టుడే-సీవోటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ వెల్లడించింది. అయితే, ప్ర‌ధాని నరేంద్ర మోడీకి ప్ర‌ధాన రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా రాహుల్ గాంధీ లేర‌ని కూడా పేర్కొంటూ ఆయ‌న స్థానానికి మ‌రో నాయ‌కుడు వ‌చ్చిన‌ట్టు తెలిపింది.   
 

Lok Sabha Elections: అధికార బీజేపీ, ప్ర‌తిప‌క్ష‌ కాంగ్రెస్ లు ఇతర పార్టీలతో కలిసి 2024 లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించాయి. లోక్‌సభ ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయం ఉంది. అంతకుముందే ఓటర్ల అభిప్రాయాన్ని తెలుసుకోవ‌డానికి స‌ర్వేలు షురూ అయ్యాయి. ఓ వైపు ప్రధాని నరేంద్ర మోడీ పని తీరుపై సర్వేలు జరుగుతుండగా, మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యర్థి ఎవరు అని జనాలు ఏమనుకుంటున్నారు? ఈ విషయం తెలుసుకునేందుకు కూడా ప‌లు స‌ర్వే సంస్థ‌లు  ప్రయత్నిస్తున్నాయి. అయితే, ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాలు గ‌మ‌నిస్తే.. దేశంలో  2024 లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. కేంద్రంలో అధికార పీఠం నుంచి బీజేపీని గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్న ప‌రిస్థితులు ఉన్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మోడీకి ప్రత్యర్థి ఎవరు? దీనికి సంబంధించి ఇండియా టుడే, సీ ఓటర్ సర్వే నిర్వహించాయి. ఇందులో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించాయి.  

లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం మాత్రమే మిగిలి ఉండగా, భారతదేశంలోని ప్రజలు నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నట్లు ఇండియా టుడే-సీవోటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ వెల్లడించింది.  అయితే, ప్ర‌ధాని నరేంద్ర మోడీకి ప్ర‌ధాన రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా రాహుల్ గాంధీ లేర‌ని కూడా పేర్కొంటూ ఆయ‌న స్థానానికి మ‌రో నాయ‌కుడు వ‌చ్చిన‌ట్టు తెలిపింది. ప్రత్యర్థి పార్టీల్లో ఒకరి కంటే ఎక్కువ మంది నాయకులు ఉన్నప్పటికీ నరేంద్ర మోడీకి రాజకీయ ప్రత్యర్థి ఎవరు? ఈ ప్రశ్న తరచుగా అడిగేది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీని ఓడించేది ఎవరు? 'మూడ్ ఆఫ్ ది నేషన్' డేటా ప్రకారం, ప్రధాని నరేంద్ర మోడీకి పోటీగా ఏ నాయకుడు?  ఉన్నాడు అనేది వెల్ల‌డించింది. ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థిగా ఉన్న రాహుల్ గాంధీని మ‌రో వ్య‌క్తం భ‌ర్తీ చేసిన‌ట్టు ఈ నివేదిక‌లు పేర్కొన్నాయి.

ఇండియా టుడే, సీ ఓటర్ సర్వే ప్రకారం 2024 ఎన్నికల్లో ప్రధాని మోడీకి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అతిపెద్ద ప్రత్యర్థిగా ఉన్నార‌ని  స‌ర్వే నివేదిక‌లు పేర్కొన్నాయి. 24 శాతం మంది ప్రజలు అరవింద్ కేజ్రీవాల్‌ను మోడీకి సమర్థ ప్రత్యర్థిగా అభివర్ణించారు. ఆ తర్వాత 20 శాతంతో మమతా బెనర్జీ రెండో స్థానంలో ఉన్నారు. రాహుల్ గాంధీ 13 శాతంతో మూడో స్థానంలో ఉండ‌టం గ‌మ‌నార్హం. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు 5 శాతం ఓట్లు వచ్చాయి. 2024లో ప్రధాని నరేంద్ర మోడీకి, ఎన్డీయేకి అరవింద్ కేజ్రీవాల్ అతి పెద్ద ప్రత్యర్థి అవుతారని ఇండియా టూడే, సీ వోట‌ర్ సర్వేలో తేలింది. 


ప్రతిపక్ష పార్టీకి సమర్థుడైన నాయకుడు ఎవరు?

ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ముందుకు న‌డిపే నాయ‌కుడిగా కూడా కేజ్రీవాల్ ముందున్నార‌ని స‌ర్వేలో వెల్ల‌డైంది.

అరవింద్ కేజ్రీవాల్  మమతా బెనర్జీ  రాహుల్ గాంధీ 
24 శాతం  20 శాతం  13 శాతం 

 
ఇదిలా ఉంటే, ప్రతిపక్షంలో అత్యంత ప్రభావవంతమైన, శక్తిమంతమైన నాయకుడు ఎవరు? అనే ప్ర‌శ్న‌కు అరవింద్ కేజ్రీవాల్‌ను ఎక్కువ మంది ప్రజలు ఇష్టపడుతున్నార‌ని స‌ర్వేలో వెల్ల‌డైంది. రాహుల్ గాంధీకి మూడో స్థానంలో ఉన్నారు. భారత్ జోడో యాత్ర తర్వాత కూడా రాహుల్ గాంధీ రేసులో వెనుకంజలో ఉన్న‌ట్టు స‌ర్వే పేర్కొన‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది.

గమనిక - ఇది ఇండియా టుడే, సీవోటర్ నిర్వహించిన సర్వేకు సంబంధించిన సమాచారం మాత్రమే. 

click me!