ఎఫ్బీ లైవ్ లో ఆత్మహత్యాయత్నం.. 15 ని.ల్లోనే కనిపెట్టి, కాపాడిన పోలీసులు.. ఎలాగంటే..

By SumaBala BukkaFirst Published Feb 3, 2023, 10:36 AM IST
Highlights

ఆత్మహత్యచేసుకోవాలనుకున్న ఓ వ్యక్తి.. దాన్ని సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారాన్ని చేయడం మొదలుపెట్టాడు. ఇది ప్రారంభమైన 15 నిమిషాల్లోనే పోలీసులు అతని ఇంటిని గుర్తించి, ఆపారు.

ఉత్తరప్రదేశ్‌ : ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. దాన్ని లైవ్ స్ట్రీమ్ చేసి మరీ చూపించాలనుకున్నాడు. దీనికోసం ఫేస్ బుక్ లైవ్ స్టార్ట్ చేశాడు. కానీ మెటాతో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం.. ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడేలా చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ లోని ఘజియాబాద్ లో జరిగింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే.. 

ఉత్తరప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలనుకున్నాడు. మంగళవారం సోషల్ మీడియాలో తన ప్రయత్నాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాడు. అయితే, అతను లైవ్ స్ట్రీమ్ ప్రారంభించిన 15 నిమిషాల్లోనే, పోలీసు అధికారులు ఘజియాబాద్ లోని అతని ఇంటికి చేరుకున్నారు. ఇంత త్వరగా అతడిని కనిపెట్టడం వెనుక కాలిఫోర్నియాలోని మెటా నుండి వచ్చిన సమాచారమే కారణం.. దీంతో అతడిని అడ్డుకున్నారు.

గురుగ్రామ్ లో కంఝవాలా తరహా యాక్సిడెంట్.. బైక్ ను వేగంగా ఢీకొట్టి 3 కిలో మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు..

మెటా, ఉత్తరప్రదేశ్ పోలీసుల మధ్య గత ఏడాది మార్చిలో కుదిరిన ఓ ఒప్పందం అభయ్ శుక్లా ప్రాణాలను కాపాడింది. ఫేస్‌బుక్ వెంటనే ఈ విషయాన్ని రాష్ట్ర డిజిపి కార్యాలయ మీడియా కేంద్రానికి ఇమెయిల్ పంపండం ద్వారా అప్రమత్తం చేసింది. "ఆ వ్యక్తి వాస్తవానికి ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌కు చెందినవాడు. ఇటీవల అతనికి రూ. 90,000 నష్టం వచ్చింది. దీంతో అతను ఈ చర్య తీసుకున్నాడు" అని ఘజియాబాద్ పోలీసు సీనియర్ అధికారి అన్షు జైన్ తెలిపారు.

మెటా పంపిన అలర్ట్ అందుకున్న ఘజియాబాద్ పోలీసులు శుక్లా ఇంటిని వెతకడానికి రంగంలోకి దిగారు. అది కాస్త కష్టమైన పనే.. అయినా వెనకడుగు వేయకుండా వారు చేసిన ప్రయత్నం ఫలించింది. ఘజియాబాద్‌లోని విజయనగర్ ప్రాంతంలో అతని నివాసాన్ని కనుగొనగలిగారు. పోలీసులు అభయ్ శుక్లాను అతని గదిలో కనిపెట్టారు. ఆత్మహత్యాయత్నానికి ముందే అతన్ని అడ్డుకున్నారు. 

గత డిసెంబర్‌లో, గౌహతిలో 27 ఏళ్ల వ్యక్తి ఫేస్‌బుక్‌లో లైవ్ కాస్టింగ్ చేస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు, తన స్నేహితురాలు తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందని, అలా చేసేలా ఆమె కుటుంబం ఆమెపై ఒత్తిడి తెచ్చిందని పేర్కొన్నాడు. అతని మృతికి మహిళ కుటుంబమే కారణమని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

click me!