మోడీ జీ.. నా అన్నరాహుల్ గాంధీని చూసి నేర్చుకోండి - కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ

By Asianet News  |  First Published May 1, 2023, 9:09 AM IST

ప్రజా జీవితంలో ఎలా ఉండాలో తన సోదరుడు రాహుల్ గాంధీని చూసి నేర్చుకోవాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. ప్రజా జీవితంలో దూషణలను భరించాల్సి ఉంటుందని, ధైర్యంగా ఉండాలని, ప్రజల గొంతు వినాలని తెలిపారు. 


ప్రజాజీవితంలో విమర్శలను ఎదుర్కోవాల్సిందేనని, దేశం కోసం బుల్లెట్లు కూడా దించుకోవడానికి సిద్ధంగా ఉన్న తన సోదరుడు రాహుల్ గాంధీని చూసి నేర్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సూచించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాగల్ కోటే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు ప్రియాంక గాంధీ హాజరై మాట్లాడారు. బీజేపీపై, ప్రధానిపై విమర్శలు చేశారు.

కాలేజీ ఫీజు కోసం స్నేహితుల సాయం కోరిన యువతి.. హోటల్ లో బంధించి మూడు రోజులు అత్యాచారం

Latest Videos

‘‘గత రెండు మూడు రోజులుగా తాను చూస్తున్నది వింతగా ఉంది. గతంలో నేను చాలా మంది ప్రధానులను చూశాను. ఇందిరాగాంధీని చూశాను. ఆమె ఈ దేశం కోసం బుల్లెట్లు తీసుకున్నారు. రాజీవ్ గాంధీని చూశాను. ఆయన ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ఈ దేశం కోసం ఎంతో కష్టపడటం నేను చూశాను’’ అని ఆమె అన్నారు.

కానీ.. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ఏడుస్తూ ప్రజల వద్దకు వచ్చే ప్రధానిని తాను ఇంతకు ముందెన్నడూ చూడలేదని ఓటర్లను ఉద్దేశించి ప్రియాంక గాంధీ అన్నారు. ‘‘మీ బాధలను, సమస్యలను వినేందుకు బదులు తనను దూషిస్తున్నారని వచ్చి చెప్పే ప్రధానిని నేను చూడటం ఇదే మొదటిసారి. ప్రధాని కార్యాలయంలో ఎవరో ప్రజల సమస్యల గురించి కాకుండా, ప్రధానిని అనేక సార్లు దూషించిన వారి జాబితాను తయారు చేశారట. దాదాపు కనీసం 91 దూషణలు ఉన్నాయట. అవి ఒక పేజీలో సరిపోతాయి. కానీ నా కుటుంబంపై చేసిన దూషణల సంఖ్యను, బీజేపీ వ్యక్తిగతంగా చేసిన దాడిని లెక్కపెట్టడం ప్రారంభిస్తే కొన్ని పుస్తకాలు ప్రచురించాల్సి ఉంటుంది’’ అని ఆమె అన్నారు. 

16 ఏళ్ల అమ్మాయిని పెళ్లాడిన 65 ఏళ్ల మేయర్.. వెంటనే అత్తకు ప్రమోషన్..

‘‘ధైర్యంగా ఉండండి మోదీజీ. నా సోదరుడు రాహుల్ గాంధీని చూసి నేర్చుకోండి. కేవలం దూషణలు మాత్రమే కాకుండా ఈ దేశం కోసం బుల్లెట్లను కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని నా సోదరుడు చెబుతున్నాడు. మీరు దూషించినా, బుల్లెట్ కాల్చినా, కత్తితో పొడిచినా తాను సత్యం కోసం నిలబడతానని చెబుతున్నాడు’’ అని ప్రియాంక గాంధీ అన్నారు. ‘‘మోడీజీ భయపడొద్దు. ఇది ప్రజాజీవితం. ఇలాంటివి భరించాల్సిందే. ధైర్యంగా ముందుకు సాగాలి. ప్రజల గొంతు వినాలి’’ అని ఆమె సూచించారు. 

కేంద్ర మంత్రి జీ కిష‌న్ రెడ్డికి అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్ కార్డియాక్ కేర్ యూనిట్ లో అడ్మిట్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తనపై మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు తనను విషపూరిత పాము అని అభివర్ణించాడని, ఇప్పటి వరకు ఆ పార్టీ నేతలు తనపై 91 సార్లు వివిధ రకాల దూషణలకు పాల్పడ్డారని ప్రధాని మోడీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపైనే ప్రియాంక గాంధీ స్పందించి మాట్లాడారు.

click me!