
Rahul Gandhi: ఉక్రెయిన్ సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం రష్యా పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం విమర్శల దాడి చేశారు. ట్విటర్ వేదికగా.. చైనా, పాకిస్తాన్‌లు కలిసి రష్యాకు మద్దతు పలుకుతున్నట్టు వస్తున్న పలు వార్తాలను పోస్ట్ చేశారు. ఇరు దేశాలు ఒక్కటేతే.. కేంద్రంలోని మోడీ సర్కార్ వ్యూహాత్మక తప్పిదాల వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడుతుంది విమర్శించారు.
మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని తొలి నుండే తీవ్రంగా విమర్శిస్తున్నారు రాహుల్ గాంధీ. కేంద్రం.. చైనా, పాకిస్థాన్‌లను ఏకతాటిపైకి తీసుకువస్తోందని ఆరోపించారు. అలాగే.. గత నెలలో పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశం నలుమూలలా విరోధులతో చుట్టుముట్టబడిందని, భారత్ ఒంటరైందని ఆందోళన వ్యక్తం చేశారు.
చైనా, పాకిస్థాన్‌లను వేరుగా ఉంచడమే భారత్ వ్యూహాత్మక లక్ష్యం. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా ఆ రెండు దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడమేననీ విమర్శించారు. మోదీ నిర్వాకంతోఈ దేశాల నుంచి భారత్ తీవ్రమైన ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందనీ హెచ్చరించారు.
ఉక్రెయిన్ సంక్షోభం సాగుతున్న వేళ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో గురువారం సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక సహకారంపై చర్చించారు. రష్యన్ కంపెనీల సహకారంతో భారీ గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణం సహా పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాల నాయకులు చర్చించారు.
ఈ ఉద్రిక్తత వాతావరణంలో రష్యా కు పాక్ ప్రధాని వెళ్లడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. రష్యాకు చైనా, పాక్ పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లు కొన్ని రోజులుగా సందేహాలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఓ పాకిస్థాన్ ముఖ్య నేత రష్యాలో పర్యటించడం ఇదే మొట్టమొదటి
ఉక్రెయిన్‌పై రష్యా గురువారం యుద్ధం ప్రారంభించడమంతో అమెరికా సహా పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. పలు పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. రష్యాతో పోరాడేందుకు తమ దేశం ఒంటరిగా మిగిలిపోయిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి రోజు పోరాటం తర్వాత 137 మంది మరణించారని తెలియజేశారు.