లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు మోడీ మార్క్ షాక్ .. యూపీఏ పాలనపై శ్వేతపత్రం

Siva Kodati |  
Published : Feb 06, 2024, 06:36 PM ISTUpdated : Feb 06, 2024, 07:28 PM IST
లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు మోడీ మార్క్ షాక్ .. యూపీఏ పాలనపై శ్వేతపత్రం

సారాంశం

నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2004 నుంచి 2014 మధ్య దేశాన్ని పాలించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ ఆర్థిక దుర్వినియోగంపై మోదీ ప్రభుత్వం ‘శ్వేతపత్రం’ తీసుకురానుంది . ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2004 నుంచి 2014 మధ్య దేశాన్ని పాలించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ ఆర్థిక దుర్వినియోగంపై మోదీ ప్రభుత్వం ‘శ్వేతపత్రం’ తీసుకురానుంది. ఈ కారణంగానే పార్లమెంటు సమావేశాలను ఒకరోజు పొడిగించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆర్థిక దుర్వినియోగంపై శ్వేతపత్రం ద్వారా భారతదేశ ఆర్థిక దుస్థితి , ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలను శ్వేతపత్రం వివరిస్తుంది. 

 

 

ఫిబ్రవరి 10న ఈ శ్వేతపత్రం పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశం వుంది. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను మధ్యంతర బడ్జెట్‌ను సమర్పిస్తూ నిర్మలా సీతారామన్ కూడా ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. 2014 వరకు దేశం ఎక్కడ వుందో, ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చిందో శ్వేతపత్రంలో పరిశీలిస్తారని ఆర్ధిక మంత్రి అన్నారు. 2014లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు దాని బాధ్యత చాలా పెద్దదని ఆమె గుర్తుచేశారు. 

2014లో తమ ప్రభుత్వం పగ్గాలు చేపట్టినప్పుడు,, ఆర్ధిక వ్యవస్ధను దశలవారీగా చక్కదిద్దడం , పాలనా వ్యవస్థలను క్రమబద్దీకరించడం బాధ్యతగా తీసుకున్నామన్నారు. ప్రజలకు ఆశాజనకంగా ఉండటం, పెట్టుబడులను ఆకర్షించడం, అవసరమైన సంస్కరణలకు మద్ధతు ఇవ్వడం అవసరమని నిర్మల వ్యాఖ్యానించారు. అప్పటి సంక్షోభం ముగిసిందని, ఆర్ధిక వ్యవస్ధ సర్వోతోముఖాభివృద్ధితో  అత్యంత స్థిరమైన వృద్ధి మార్గంలో దృఢంగా వుంచబడిందని పేర్కొన్నారు. 2024-25లో భారతదేశ వాస్తవ జీడీపీ వృద్ధి 7.3 శాతంగా అంచనా వేయబడింది. 

నేషన్ ఫస్ట్ అనే మా బలమైన నమ్మకాన్ని అనుసరించి ప్రభుత్వం దానిని విజయవంతంగా చేసిందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇన్నాళ్ల దుర్వినియోగం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం వుందని ఆర్ధిక మంత్రి చెప్పారు. పాలన, అభివృద్ధి, పనితీరు , ఆదర్శ ప్రాయమైన ట్రాక్ రికార్డ్‌తో వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు రాబోయే సంవత్సరాల్లో అంకితభావం , కృషి కావాలని నిర్మల అన్నారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్