PM Modi: కలలు సాకారం చేశారు.. అందుకే మోడీని ఎన్నుకుంటారు: పదేళ్లలో మోడీ నెరవేర్చిన హామీలపై పాలసీ ఫిలిమ్

By Mahesh K  |  First Published Feb 6, 2024, 6:17 PM IST

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గత పదేళ్లలో అమలు చేసిన హామీల ఆధారంగా చిత్రాలు తీశారు. విధాన పరమైన నిర్ణయాలను ఆధారం చేసుకుని ఎనిమిది భాషల్లో తీసిన ఈ చిత్రాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ప్రధాని మోడీ కూడా వీటిని షేర్ చేశారు.
 


కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లలో నెరవేర్చిన హామీలపై ఓ శక్తివంతమైన చిత్రం రూపొందించారు. ఈ చిత్రాన్ని బీజేపీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ విడుదల చేశాయి. పీఎం ముద్ర యోజనా పై తీసిన చిత్రాన్ని ఎనిమిది భాషల్లో (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, అస్సామీ, ఒడియా, బెంగాలి, హిందీ) విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారిక ఎక్స్ హ్యాండిల్ కూడా షేర్ చేసింది.

మొత్తం ఐదు చిత్రాలను ఎనిమిది భాషల్లో రూపొందించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ముఖ్యమైన విధానపరమైన నిర్ణయాలను, హామీల ఆధారంగా ఈ చిత్రాలను నిర్మించారు. ముద్ర యోజనా, జన్ ధన్ యోజనా, ఉజ్వల యోజనా, యూపీఐ, పీఎం ఆవాస్ యోజనా పథకాల ఆధారంగా ఈ చిత్రాలను నిర్మించారు.

ముద్రా యోజన ఒక పరివర్తనాత్మక చొరవ, లక్షలాది మందికి సాధికారతనిస్తుంది, వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తుంది. అత్యధిక సంఖ్యలో మహిళలు, ఎస్సీ/ఎస్టీ,ఓబీసీ ప్రజలు లబ్దిపొందడం కూడా గమనార్హం. https://t.co/MqzwFsRR7X

— Narendra Modi (@narendramodi)

Latest Videos

2024 లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటికే క్యాంపెయిన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ‘కలలు కాదు.. అవి నిజం అవుతాయి. అందుకే అందరు మోడీని ఎన్నుకుంటారు’ అని బీజేపీ ప్రచారాన్ని మొదలు పెట్టింది. ప్రధాని మోడీ ఇచ్చిన హామీలు అమలు చేశారని, వాటి ద్వారా వృద్ధులు, వయోజనులు, వచ్చే తరం కూడా ప్రయోజనాలు పొందారని పేర్కొన్నారు. 

ఈ వీడియోలు విడుదలవ్వగానే #TabhiTohSabModiKoChunteHain ట్రెండింగ్‌లోకి వచ్చింది. చాలా మంది వీటిని షేర్ చేశారు. బీజేపీ సోషల్ మీడియా మొత్తంగా వీటిని పంచుకుంది. కేంద్ర మంత్రులు సహా బీజేపీ ముఖ్యమంత్రులు కూడా వీటిని షేర్ చేశారు. అంతేకాదు, ఇదే ట్రెండ్ ప్రధాని నరేంద్ర మోడీ పర్సనల్ యాప్ అయిన నమో యాప్‌లోనూ ట్రెండ్ అవుతున్నది. చాలా మంది వాలంటీర్లు వీటిని ట్వీట్ చేస్తున్నారు. 

click me!