కోరిక తీర్చలేదని మోడల్‌ను దారుణంగా చంపిన ఫోటోగ్రాఫర్

sivanagaprasad kodati |  
Published : Feb 01, 2019, 08:51 AM IST
కోరిక తీర్చలేదని మోడల్‌ను దారుణంగా చంపిన ఫోటోగ్రాఫర్

సారాంశం

ముంబైలో సంచలనం సృష్టించిన మోడల్ మన్సీ దీక్షిత్ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. కోరిక తీర్చలేదనే కోపంతో ఫోటోగ్రాఫర్ సయ్యద్ ముజమ్మిల్ ఆమెను దారుణంగా హత్య చేసినట్లు అంగీకరించాడు.

ముంబైలో సంచలనం సృష్టించిన మోడల్ మన్సీ దీక్షిత్ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. కోరిక తీర్చలేదనే కోపంతో ఫోటోగ్రాఫర్ సయ్యద్ ముజమ్మిల్ ఆమెను దారుణంగా హత్య చేసినట్లు అంగీకరించాడు. వివరాల్లోకి వెళితే.. మోడల్ కావాలనే ఆశయంతో మన్సీ ముంబైకి వచ్చింది..

అయితే అప్పటికే ఫోటోగ్రాఫర్‌గా ఉన్న సయ్యద్‌కు ఆమెతో అంతకు ముందే పరిచయం ఉంది. ఆమె అందానికి ముగ్ధుడైన అతను.. దీక్షిత్‌ను లోబరచుకోవాలనుకున్నాడు. దీనిలో భాగంగా ఫోటో షూట్‌ కోసం ఆమెను ఇంటికి రప్పించిన అతను తన మనసులో మాటను చెప్పాడు.

దీనికి మన్సీ నిరాకరించడంతో ఓ స్టూలుతో తలపై కొట్టాడు. అనంతరం ఆమె మెడకు తాడు బిగించి హతమార్చాడు. ఆధారాలు మాయం చేసేందుకు గాను మృతదేహన్ని ఓ సంచిలో కట్టేసి క్యాబ్‌లో తీసుకెళ్లి ఓ ఫుట్‌పాత్‌పై పడేసి వెళ్లిపోయాడు.

సంచిలో శవాన్ని గుర్తించిన క్యాబ్ డ్రైవర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ముజమ్మిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బంధువొకరు అనారోగ్యంతో బాధపడుతుండటంతో హత్యకు ముందు రోజు నిందితుడు హైదరాబాద్ నుంచి ముంబై వచ్చినట్లు అతని కుటుంబసభ్యులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..