కదులుతున్న కుమారస్వామి కుర్చీ: రాహుల్ కు దేవెగౌడ హెచ్చరిక

By Nagaraju TFirst Published Jan 31, 2019, 1:24 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ నేతలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని దిగిపోతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులు చక్కదిద్దాలని లేని పక్షంలో పదవిలో కొనసాగలేనని స్పష్టం చేశారు. తాజాగా మాజీ ప్రధాని కుమార స్వామి తండ్రి దెవెగౌడ కూడా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని హెచ్చరించారు.
 

కర్ణాటక: కర్ణాటక రాష్ట్రంలో రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి. కర్ణాటక సీఎం కుర్చీపై కన్నేసిన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంతో ముఖ్యమంత్రి అయిన కుమార స్వామిని ఉక్కిరిబిక్కిరి పెడుతోంది. ఎలాగైనా కుర్చీలో కూర్చోవాలని కాషాయిదళం ప్లాన్ లు మెుదలు పెట్టింది. 

సీఎం కుర్చీయే లక్ష్యంగా అన్ని అస్త్రాలను ప్రయోగించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఇక ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు నెమ్మదిగా గేలం వేస్తోంది. విషయం పసిగట్టిన సీఎం కుమార స్వామి అసహనం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ పార్టీ నేతలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని అవసరం అయితే దిగిపోతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులు చక్కదిద్దాలని లేని పక్షంలో పదవిలో కొనసాగలేనని స్పష్టం చేశారు. తాజాగా మాజీ ప్రధాని కుమార స్వామి తండ్రి దెవెగౌడ కూడా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని హెచ్చరించారు.

 కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి బాగోలేదని స్పష్టం చేశారు. పరిస్థితి చేయిజారిపోతుందని కాస్త కంట్రోల్ లో పెట్టండంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే సంకీర్ణ ప్రభుత్వంలో సూపర్‌ సీఎం అనిపించుకున్న కుమారస్వామి సోదరుడు మంత్రి రేవణ్ణ బీజేపీ కీలక నేత శోభాకరంద్లాజేతో భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. 

సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆపరేషన్‌ కమల అమలవుతున్న తరుణంలోనే రేవణ్ణ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీతో కలయికపై జేడీఎస్ నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. 

తాము కాంగ్రెస్‌తో కంటే బీజేపీతో కలసి ఉంటే బాగుండేదని స్వయానా మంత్రి పుట్టరాజు వ్యాఖ్యానించడం కన్నడ నాట సంచలనం రేకెత్తించింది. మంత్రి పుట్టరాజు చేసిన వ్యాఖ్యలకు రోజు గడవక ముందే బీజేపీ నేత శోభాకరంద్లాజేను మంత్రి రేవణ్ణ కలవడం రాజకీయ వర్గావల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఆయన కార్యాలయం మాత్రం అలాంటిది ఏమీ జరగలేదని చెప్తోంది. మెుత్తానికి కర్ణాటక రాజకీయాలు క్షణక్షణ ఉత్కంఠను రేపుతున్నాయి. 

ఈ వార్తలు కూడా చదవండి

కాంగ్రెస్ హద్దులు దాటుతోంది, దిగిపోతా: కుమారస్వామి

కుమారస్వామి హెచ్చరిక...కాంగ్రెస్ ఎమ్మెల్యేకు నోటీసులు

click me!