
న్యూఢిల్లీ: ఎస్‌బీఐ ఖాతాదారుల అకౌంట్ల వివరాలను హ్యాకర్లు అత్యంత సులువుగా తెలుసుకోవచ్చని టెక్ క్రంచ్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే లక్షలాది మంది ఖాతాదారుల ఫోన్ నెంబర్లు, బ్యాంకు బ్యాలెన్స్ లావాదేవీల వివరాలు లీకయ్యాయని ఆ కథనం ప్రకటించింది.
ఎస్‌బీఐ ఖాతాదారులు మిస్డ్ కాల్ ద్వారా బ్యాంకింగ్ సమాచారాన్ని తెలుసుకొనే సదుపాయమే ఎస్‌బీఐ క్విక్. ముంబైలోని సర్వర్ డేటా సెంటర్‌కు పాస్‌వర్డ్ ప్రోటెక్షన్ లేదని ఈ కథనం తెలిపింది. ఈ కారణంగానే హ్యాకర్లు సులభంగా ఖాతాదారుల అకౌంట్ల వివరాలను తెలుసుకొనే వెసులుబాటు ఉంటుందని ఆ కథనం ప్రకటించింది.
ఎస్‌బీఐ కు దేశంలో సుమారు 42 కోట్ల పైగా ఖాతాలు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు ఉపయోగించని ఖాతాదారులు ఎస్‌బీఐ క్విక్ ద్వారా టెక్ట్స్ మేసేజ్ ద్వారా బ్యాంకులో ఎంత నగదు ఉందో సమాచారాన్ని తెలుసుకొనే వెసులుబాటు ఉంటుంది.ఎస్‌బీఐ సూచించిన కీవర్డ్స్ఆధారంగా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్నుంచి ఈ సమాచారాన్ని ఖాతాదారులు తెలుసుకోవచ్చు.
ఇలా ఎస్‌బీఐ క్విక్‌కు రోజూ మెసేజ్‌లు బట్వాడా అవుతాయనీ, అయితే పాస్‌వర్డ్ లేని డేటాబేస్‌కు సంబంధించిన సమాచారాన్ని హ్యాకర్లు సులువుగా తెలుసుకోవచ్చని చెబుతోంది. పేరు చెప్పడానికి సెక్యూరిటీ ఏజెన్సీ ఇటీవల జరిపిన పరిశోధనలో ఈ విషయాన్ని గుర్తించినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఒక్క సోమవారం రోజే ఇలాంటి దాదాపు 30లక్షల నకిలీ మెసేజ్‌లు ఎస్‌బీఐ కస్టమర్లకు అందాయని టెక్ క్రంచ్ ఆరోపించింది.
ఈ కథనంపై ఎస్బీఐ స్పందించింది. ఖాతాదారుల భద్రతకు తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని ఎస్‌బీఐ ప్రకటించింది. డేటా లీక్‌పై మీడియాలో వచ్చిన కథనాలను పరిశీలిస్తున్నామని తెలిపింది. ఈ విషయమై విచారణ జరుపుతున్నట్టు ట్వీట్ చేసింది. ఈ విషయమై విచారణ చేసిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఎస్‌బీఐ ట్వీట్ చేసింది.