మీ చేతిలోని మొబైల్ ఫోన్ ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని వైద్యులు ధ్రువీకరించారు. మరీ ముఖ్యంగా ఆస్పత్రులలో పనిచేసేవారు అక్కడకు తమ ఫోన్లకు తీసుకువెళ్లకపోవడమే ఉత్తమమని చెముతున్నారు.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. మన దేశంలోనూ ఈ వైరస్ విలయతాండవం చేస్తోంది. అయితే.. ఈ వైరస్ సోకకుండా ఉండేందుకు చాలా మంది చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అత్యవసరంగా బయటకు వెళ్లి రావాల్సి వస్తే.. మూతికి మాస్క్ లు పెట్టుకుంటున్నారు. తర్వాత ఇంటికి రాగానే శానిటైజర్ రాసుకుంటున్నారు. అవసరమైతే స్నానం చేస్తున్నారు.
ఇంత వరకూ బాగానే ఉంది. మరి మీ చేతిలో ఫోన్ పరిస్థితి ఏంటి..? అవును దీని గురించి కూడా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. మీ చేతిలోని మొబైల్ ఫోన్ ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని వైద్యులు ధ్రువీకరించారు. మరీ ముఖ్యంగా ఆస్పత్రులలో పనిచేసేవారు అక్కడకు తమ ఫోన్లకు తీసుకువెళ్లకపోవడమే ఉత్తమమని చెముతున్నారు.
ముఖం, నోటి నుంచి నేరుగా మొబైల్ ఫోన్ ఉపరితలం పైకి వైరస్ వచ్చి చేరుతున్నట్లు గుర్తించారు. తరచూ చేతులు శుభ్రం చేసుకుంటున్నా.. సగటున మొబైల్ వినియోగం ఎక్కువగా ఉండటంతో వైరస్ వ్యాప్తి కూడా అందుకు తగినట్లే ఉంటుందని చెబుతున్నారు.
కరోనా నివారణకు డబ్బ్యహెచ్ఓ సహా అనేక సంస్థలు మార్గదర్శకాలు విడుదల చేశాయి. అయితే.. అందులో మొబైల్ ఫోన్ల గురించి ఎవరూ ప్రస్తావించలేదు. అయితే.. మొబైల్ ఫోన్ ని కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని ఎయిమ్స్ వైద్యులు చెబుతున్నారు.
మీ ఫోన్లను ఐసోప్రొఫైల్ ఆల్కహాల్ ఉన్న శానిటైజర్ లేదా, క్లోరాక్స్ డిస్ ఇన్ఫెక్టింగ్ వైప్స్ తో శుభ్ర పరుచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.