ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రక్కులు ఢీకొనడంతో 23 మంది వలస కూలీలు మరణించారు. పంజాబ్ నుంచి యూపీలో స్వస్థలాలకు బయలుదేరిన కూలీలు ప్రమాదానికి గురయ్యారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని ఔరాయా జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 23 మంది మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు.
వలస కూలీల ట్రక్కును మరో ట్రక్కు ఢీకొనడంతో ఆ ప్రమాదం జరిగింది. వలసకూలీలు రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ లోని స్వగ్రామాలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
undefined
లాక్ డౌన్ నేపథ్యంలో వలస కూలీలు వివిధ రాష్ట్రాల నుంచి తమ స్వగ్రామాలకు చేరుకునేందుకు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. కొంత మంది గమ్యస్థానాలను చేరుకోకుండానే అసువులు బాస్తున్నారు.
మధ్యప్రదేశ్ లో ఇటీవల ట్రక్కు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వలస కూలీలు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుంచి 18 మంది కూలీలు ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకు వెళ్లడానికి మామిడికాయలతో బయలుదేరిన ట్రక్కులో ఎక్కారు. ట్రక్కు నార్సింగ్ పూర్ వద్ద బోల్తా పడింది.
మహారాష్ట్రలో రైలు పట్టాలపై పడుకున్న వలస కూలీలు గూడ్స్ రైలు రావడంతో 16 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే.