కరెంట్ దొంగ : పాక్కుంటూ వెళ్లి..పట్టుబడ్డాడు... !

By AN TeluguFirst Published Jul 15, 2021, 10:42 AM IST
Highlights

టెర్రస్ మీద ఉన్న మెట్ల మీద ఇటుక రాళ్లతో కప్పి ఉన్న జాయింట్ వైర్లు కట్ చేస్తున్న సమయంలో అప్పటికే ఓ అధికారి టెర్రస్ మీదకి వెళ్లి ఇదంతా వీడియో తీస్తున్నాడు. వ్యక్తిని గమనిస్తూ వీడియో తీస్తున్న ఎలక్ట్రిసిటీ ఆఫీసర్.. అతను జాయింట్ ని కట్  గా చేయబోగా.. ‘బ్రదర్ నేను ఇక్కడే నిల్చున్న’ అంటూ బదులిచ్చాడు.

ఉత్తర్ ప్రదేశ్ : కరెంట్ బిల్లు కట్టకుండా ఎగ్గొట్టడం ఎందుకు నానా వేషాలు వేసుకుంటారు కొంతమంది.  అధికారులకు తెలియకుండా ఫోన్ నుంచి దొంగతనంగా వైర్లను లాక్కుని కరెంటు వాడుకుంటారు. చదువుకోని వారు పెద్దగా అవగాహన లేని వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు అనుకుంటే పొరపాటే.  చదువుకున్న వారు సైతం తెలివిగా కరెంటు దొంగతనాలు చేయడానికి అలవాటు పడుతున్నారు.

ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ కు చెందిన ఓ వ్యక్తి అచ్చం ఇలాగే  విద్యుత్ దొంగతనానికి  అలవాటు పడ్డాడు.  మూడో కంటికి తెలియకుండా కరెంటు వాడుకునేవాడు. రోజంతా అక్రమంగా విద్యుత్ వినియోగించుకుంటూ అధికారులు పర్యవేక్షించడానికి వచ్చినప్పుడు మాత్రం వెంటనే కరెంట్ కట్ చేసి తమకు ఏం తెలియదన్నట్లు నటించేవాడు.  అయితే విద్యుత్ దొంగతనం జరుగుతుందని ఫిర్యాదు అందడంతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు అప్రమత్తమయ్యారు.

 ఈ విషయంపై విచారించడానికి అక్కడికి వెళ్లారు. ఈ విషయంపై విచారించడానికి అధికారుల రాకను గమనించిన వ్యక్తి వెంటనే బాల్కనీ పైకి వెళ్లి అక్కడున్న లింక్  వైర్ ను కట్ చేయబోయాడు. కానీ అసలు అక్కడే మొదలైంది.

కరోనా: ఇండియాలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు, రికవరీ తగ్గుముఖం

 టెర్రస్ మీద ఉన్న మెట్ల మీద ఇటుక రాళ్లతో కప్పి ఉన్న జాయింట్ వైర్లు కట్ చేస్తున్న సమయంలో అప్పటికే ఓ అధికారి టెర్రస్ మీదకి వెళ్లి ఇదంతా వీడియో తీస్తున్నాడు. వ్యక్తిని గమనిస్తూ వీడియో తీస్తున్న ఎలక్ట్రిసిటీ ఆఫీసర్.. అతను జాయింట్ ని కట్  గా చేయబోగా.. ‘బ్రదర్ నేను ఇక్కడే నిల్చున్న’ అంటూ బదులిచ్చాడు.

 ఆ మాట విని అయ్యో దొరికిపోయాను అనే రేంజ్ లో కరెంట్ దొంగ ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. ఇక దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇదిలా ఉండగా ఇలాంటి సంఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి వీటి కోసం పోలీసు స్టేషన్లలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాయి 

click me!