అమెరికాలో తెలుగు బాలిక అదృశ్యం.. నెల రోజులుగా వెతుకుతున్న తల్లిదండ్రులు..

Published : Feb 13, 2023, 01:15 PM IST
అమెరికాలో తెలుగు బాలిక అదృశ్యం.. నెల రోజులుగా వెతుకుతున్న తల్లిదండ్రులు..

సారాంశం

అమెరికాలో గత తెలుగు రోజుల నుంచి ఓ తెలుగు బాలిక కనిపించడం లేదు. ఆమె కోసం తల్లిదండ్రులు, బంధువుల వెతుకుతున్నారు. ఆమెను తమ దగ్గరికి తీసుకొచ్చిన వారికి 5 వేల డాలర్లు ఇస్తామని తల్లిదండ్రులు ప్రకటించారు. 

అమెరికాలోని అర్కాన్సాస్ రాష్ట్రానికి చెందిన 14 ఏళ్ల భారతీయ అమెరికన్ బాలిక మరుపల్లి తన్వి జనవరి 17 నుంచి కనిపించకుండా పోయింది. ఆమె తండ్రి ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉన్నందున్న ఆమె అమెరికాను విడిచి పారిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అర్కాన్సాస్లోని కాన్వేలో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న తన్వి చివరిసారిగా పాఠశాలకు బయలుదేరినప్పుడు సీసీటీవీ ఫుటేజీలో కనిపించిందని కాన్వే పోలీసులు ట్వీట్ చేశారు.

ఎల్‌టీటీఈ నేత ప్రభాకరన్ బ్రతికే ఉన్నారు.. సరైన సమయంలో ప్రజల ముందుకు వస్తారు: నేదుమారన్ సంచలన వెల్లడి

తెలుగువారైన మరుపల్లి పవన్ రాయ్, శ్రీదేవి దంపతుల ఏకైక కుమార్తె తన్వి, అయితే ఈ కుటుంబం ఏపీ, తెలంగాణలోని ఏ జిల్లాకు చెందిన వారో ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఐటీ రంగంలో ప్రస్తుతం కొనసాగుతున్న లేఆఫ్స్ కారణంగా టెక్ కంపెనీలో పనిచేస్తున్న పవన్ తన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంది. అందుకే ఆమె ఇంటి నుంచి పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

మెట్రో స్టేషన్ లో కదులుతున్న రైలు ముందు దూకి వ్యక్తి మృతి.. మతిస్థిమితం సరిగా లేకనే..

కాగా.. తాము ఇకపై ఉద్యోగం కోల్పోయే ప్రమాదం లేదని ఇటీవల పవన్ రాయ్ దంపతులు సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘దయచేసి తిరిగి వచ్చేయు. నేను ప్రతీ క్షణం మిమ్మల్ని మిస్ అవుతున్నాం. ఇండియాలో కూడా మీ తాతలు, మామయ్యలు నీ గురించి ఆందోళన చెందుతున్నారు. కుటుంబం, స్నేహితులు, సమాజం నీ కోసం వెతుకుతున్నారు’ అని తన్వీ తల్లి ఆ వీడియోలో వేడుకున్నారు. ఆమె తండ్రి కూడా ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో ‘‘నేను 16 గంటల పాటు బఫెలో నది మార్గంలో తప్పిపోయినప్పుడు మీరంతా నాలో ధైర్యాన్ని పెంచారు. తల్లిని చూసుకున్నారు. మీ సూచనలతో నేను మీ వద్దకు చేరుకున్నాను. నువ్వు ధైర్యవంతురాలు. విషయాలను ఎలా గుర్తించాలో తెలుసు. మీ అమ్మ అమెరికాకు తిరిగి వచ్చింది. నేను ఉద్యోగం కోల్పోయినా ఆమె ఏ కంపెనీలోనైనా పని చేయవచ్చు’’ అని తెలిపారు. 

ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీఎస్) ప్రకారం.. తన్వి తల్లి శ్రీదేవి ఇటీవల అమెరికాలో ఉద్యోగాల తొలగింపులో ఉద్యోగం కోల్పోయారు. ఆమె 2022 నవంబర్ లో భారతదేశానికి వచ్చారు. అయితే డిపెండెంట్ వీసాపై జనవరిలో ఆమె అమెరికాకు తిరిగి వెళ్లారు. తన్వీ కనిపించకుండా పోయినప్పటి నుంచి స్థానిక పోలీసులు, ఇరుగుపొరుగువారు, తన్వీ కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలిస్తున్నారు. తన్వీని ఇంటికి తీసుకువచ్చిన వారికి 5 వేల డాలర్ల రివార్డు ఇస్తామని ఆమె బంధువులు ప్రకటించారు.
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?