నువ్వు చాలా రిచ్చు గురూ.. పెళ్లికి వెళ్లడానికి మొత్తం విమానాన్నే బుక్ చేసిన వరుడు..

Published : Feb 13, 2023, 12:39 PM IST
నువ్వు చాలా రిచ్చు గురూ.. పెళ్లికి వెళ్లడానికి మొత్తం విమానాన్నే బుక్ చేసిన వరుడు..

సారాంశం

భువన్ అనే వ్యక్తి తన పెళ్లి కోసం బంధువులతో కలిసి వెళ్లేందుకు మొత్తం ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో మిలియన్‌కు పైగా వ్యూస్‌తో వైరల్‌గా మారింది.

ఇటీవల తమ పెళ్లికి బంధువులతో కలిసి వెళ్లేందుకు మొత్తం విమానాన్ని బుక్ చేసుకున్న జంట గురించిన వచ్చిన వార్తలు మీకు గుర్తున్నాయి కదా? అలాంటిదే.. ఈ ఘటన కూడా.. తన పెళ్లి కోసం ఓ వ్యక్తి విమానం మొత్తాన్ని బుక్ చేసిన ఘటన తాజాగా జరిగింది. భువన్ అనే వ్యక్తి తన పెళ్లికి వెళ్లేందుకు తన కుటుంబం కోసం మొత్తం విమానాన్ని బుక్ చేశాడు. పెళ్లికి, తన బంధువులు విమానంలో ప్రయాణిస్తున్న వీడియో క్లిప్‌ను కూడా షేర్ చేశారు. దీంతో నెట్టింట్లో ఈ వీడియో వైరల్‌గా మారింది.

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లోని ది శుభ్ వెడ్డింగ్ అనే పేజీలో షేర్ చేయబడింది. చిన్న క్లిప్‌లో, భువన్ కుటుంబం, బంధువులు కెమెరా దగ్గర ఉత్సాహంగా చేతులు ఊపుతూ కనిపించారు. "పెళ్లి ఇంటికి వెడుతున్నాం.." అని వీడియోకు క్యాప్షన్ పెట్టారు. భువన్ తన చేతులకు మెహందీతో ఉండడం కూడా క్లిప్‌లో కనిపిస్తుంది. వరుడు చాలా ఉత్సాహంగా.. వీడియో తీస్తున్న వారికి వెక్కిరింపుతో సరదా అయిన పోజులు ఇచ్చాడు. 

వీళ్ల కక్కుర్తి పాడుగానూ.. లైకుల కోసం ఏకంగా శోభనం వీడియోనే సోషల్ మీడియాకు.. నెట్టిజన్లు ఏమంటున్నారంటే...

ఆన్‌లైన్‌లో షేర్ చేయబడిన తర్వాత వీడియో మిలియన్లకొద్దీ వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో మీద చాలామంది అనేకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘మీరు ధనవంతులని చెప్పకనే చెబుతున్నారు’అని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు ‘జీవితంలో ఇన్ని డబ్బులు సంపాదిస్తే చాలు’ అంటూ కామెంటారు. 

 

PREV
click me!

Recommended Stories

Tamilnadu Assembly Election 2026: మినీ కురుక్షేత్రం.. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పూర్తి వివరాలివే !
Ram Mohan Naidu Speech | Tuticorin Airport Renamed as Thoothukudi Airport | Asianet News Telugu