మిస్ ఇండియా మానస వారణాసికి కరోనా.. మిస్ వరల్డ్ పోటీలు వాయిదా...

Published : Dec 17, 2021, 10:45 AM IST
మిస్ ఇండియా మానస వారణాసికి కరోనా.. మిస్ వరల్డ్ పోటీలు వాయిదా...

సారాంశం

మిస్ వరల్డ్ 2021 పోటీదారులతో సహా 17మంది సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు. కరోనా వచ్చిన వారిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మానస వారణాసి కూడా ఉన్నారు. పోటీదారులు, ప్రొడక్షన్ టీం సభ్యులు కరోనా బారిన పడటం వల్ల ప్రేక్షకుల భద్రత కోసం మిస్ వరల్డ్ పోటీల వాయిదా నిర్ణయం తీసుకున్నామని ఈవెంట్ ఆర్గనైజర్లు వివరించారు.

ఢిల్లీ : Miss India 2020 మానస వారణాసికి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. భారతదేశానికి చెందిన Manasa Varanasiతో సహా పలువురు పోటీదారులు కోవిడ్ -19 పాజిటివ్ బారిన పడటంతో మిస్ వరల్డ్ 2021 పోటీలు వాయిదా పడ్డాయి. ఫినాలే డిసెంబర్ 16వ తేదీన ప్యూర్టోరికోలో జరగాల్సి ఉంది. కరోనా కారణంగా మిస్ వరల్డ్ 2021 ముగింపు పోటీలు తాత్కాలికంగా వాయిదా పడినాయి. 

అయితే పోటీ దారులు, సిబ్బంది, సాధారన ప్రజల ఆరోగ్యం, భద్రత ప్రయోజనాల కారణంగా నిర్వాహకులు ఈవెంట్ ను వాయిదా వేయాల్సి వచ్చింది. తదుపరి 90 రోజుల్లో ప్యూర్టో రికోలోని జోస్ మిగ్యుల్ అగ్రెలాట్ కొలిజియంలో Miss World pageant ముగింపు షెడ్యూల్ చేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. 

మిస్ వరల్డ్ 2021 పోటీదారులతో సహా 17మంది సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు. కరోనా వచ్చిన వారిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మానస వారణాసి కూడా ఉన్నారు. పోటీదారులు, ప్రొడక్షన్ టీం సభ్యులు కరోనా బారిన పడటం వల్ల ప్రేక్షకుల భద్రత కోసం మిస్ వరల్డ్ పోటీల వాయిదా నిర్ణయం తీసుకున్నామని ఈవెంట్ ఆర్గనైజర్లు వివరించారు. 23 యేళ్ల మానస వారణాసి 70వ ప్రపంచ సుందరి పోటీల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించనుంది. 2019వ సంవత్సరంలో జరిగిన పోటీల్లో జమైకా దేశానికి చెందిన టోనీ-ఆన్ సింగ్ మిస్ వరల్డ్ 2019 కిరీటాన్ని గెలుచుకుంది. 

omicron : భార‌త్‌లో సెంచరీకి చేరువలో ఒమిక్రాన్ కేసులు..

ఇదిలా ఉండగా, డిసెంబర్ 13న అంగరంగ వైభవంగా  కొనసాగిన విశ్వసుందరి (మిస్ యూనివర్స్) 2021 పోటీల్లో భారతదేశానికి చెందిన హర్నాజ్ సంధు కిరీటాన్ని గెలుచుకుంది. 70వ మిస్ యూనివర్స్ పోటీలు ఇజ్రాయేల్ లో జరుగుతుతుండగా, హర్నాజ్ సంధు Miss Universe 2021 కీరిటం గెలుచుకుంది. పెరుగ్వేకు చెందిన నదియా ఫెరీరా, దక్షిణాఫ్రికాకు చెందిన లాలెలా లాలీ మస్వానే వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచిచారు. 

ఇజ్రాయెల్‌లోని సౌత్‌మోస్ట్ సిటీ ఐలాట్‌లో జరిగిన ప్రతిష్టాత్మక 'మిస్ యూనివర్స్ 2021' అందాల పోటీలో, భారతదేశానికి చెందిన హర్నాజ్ సంధు 'మిస్ యూనివర్స్ 2021' కిరీటాన్ని గెలుచుకుంది. చండీగఢ్‌కు చెందిన హర్నాజ్ సంధు తనకు పోటీగా నిలిచిన పరాగ్వేకు చెందిన నదియా ఫెరీరా, దక్షిణాఫ్రికాకు చెందిన లాలెలా లాలీ మస్వానేపై వెనక్కి నెట్టి కీరిటం దక్కించుకున్నారు.  దాదాపు 21 సంత్సరాల తర్వాత..భారత్ కు మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది.  

మొత్తంగా దేశానికి మూడో మిస్ యూనివర్స్ కిరీటం హర్నాజ్ సంధు అందించారు. గతంలో  1994లో సుస్మితా సేన్, 2000లో లారాదత్తాలు  Miss Universe కీరిటాన్ని అందుకున్నారు. ఈ ఏడాది ఇజ్రాయిల్ లో జరిగిన 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో  హర్నాజ్ కౌర్ ప్రపంచ సుందరిగా నిలిచారు. దాదాపు 80 మంది పోటీదారులతో పోటీపడి కిరీటాన్ని దక్కించుకుంది హర్నాజ్‌ కౌర్‌ సింధు. జ్యూరీ సభ్యురాలిగా ఎంపికైన బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతాలా ఈ పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం