క్షమాపణ చెబుతాను హోటల్ గదికి రమ్మని పిలిచి.. బాలికపై అత్యాచారం, చెబితే చంపేస్తానని బెదిరించి...

Published : Nov 19, 2021, 01:01 PM IST
క్షమాపణ చెబుతాను హోటల్ గదికి రమ్మని పిలిచి.. బాలికపై అత్యాచారం, చెబితే చంపేస్తానని బెదిరించి...

సారాంశం

హోటల్ లో బాలికతో శివం తీయగా మాట్లాడాడు. దీంతో  అమ్మాయి  అతను మారిపోయాడని నమ్మింది. ఇదే అదనుగా తీసుకున్న శివం.. మెల్లిగా ఆమెతో తిన్న తర్వాత గది దగ్గరికి వస్తే క్షమాపణ అడుగుతానని నమ్మబలికాడు. బాలిక అతడితో పాటు  గదిలోకి వెళ్ళింది. లోపలికి వెళ్ళగానే అతడు గది Doors మూసి లాక్ చేసాడు.  దీంతో షాక్ అయిన బాలిక... అతడిని.. ఎందుకు తలుపులు మూస్తున్నావ్.. అని ప్రశ్నించింది. బాలికను బెదిరించి ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.

భోపాల్ :  ఆ బాలిక నాలుగు రోజుల క్రితం హోటల్ కి వెళ్ళింది. అక్కడ ఆమెను చూసిన వారు తల్లితో చెప్పారు. దీంతో 17 ఏళ్ల ఆ కూతురిని తల్లి హోటల్ వద్ద కనిపించావట.. ‘అక్కడికి ఎందుకు వెళ్లావు? అని అడిగింది.  ఆ కూతురు ఏడుస్తూ చెప్పిన నిజాలు  విని తల్లి షాక్ అయింది.  Madhya Pradeshలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…
 
Gwalior లోని  రాయ్ సింగ్ ప్రాంతానికి చెందిన  17 ఏళ్ల Girl  స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఇంటి పక్కనే ఉండే శివం అలియాస్ కంజా బతమ్ అనే వ్యక్తి తో ఆమెకు మూడేళ్లుగా పరిచయం ఉంది.  ఆ పరిచయమే కొద్దిరోజుల తర్వాత Loveగా మారింది. బాలిక కుటుంబ సభ్యులకు ఈ ప్రేమ వ్యవహారం తెలిసి ఆమెను Shivamతో మాట్లాడకూడదని హెచ్చరించారు.

దీంతో ఆమె అతడితో మాట్లాడడం తగ్గించింది. కోపంతో రగిలిపోయిన అతడు  బాలికతో ఓ రోజు గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితం  శివం ఆమెకు  ఫోన్ చేసి ఓ సారి  తనను కలవాలని,  తను చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకుంటానని కోరాడు.  దీంతో బాలిక అతడి మాటలు నమ్మి, కలవడానికి Hotelకి వెళ్ళింది.

కమిట్మెంట్ అంటే అది..! ఛోరీ కోసమే 5 కిలోల బరువు తగ్గిన దొంగ.. అవాక్కైన పోలీసులు... !!

అక్కడ హోటల్ లో  బాలికకు శివం బాగా తినిపించాడు. తీయగా మాట్లాడాడు. దీంతో  అమ్మాయి  అతను మారిపోయాడని నమ్మింది. ఇదే అదనుగా తీసుకున్న శివం.. మెల్లిగా ఆమెతో తిన్న తర్వాత గది దగ్గరికి వస్తే క్షమాపణ అడుగుతానని నమ్మబలికాడు. అప్పటికే అతను మారాడని నమ్ముతున్న బాలిక అతడితో పాటు  గదిలోకి వెళ్ళింది. లోపలికి వెళ్ళగానే అతడు గది Doors మూసి లాక్ చేసాడు.  దీంతో షాక్ అయిన బాలిక... అతడిని.. ఎందుకు తలుపులు మూస్తున్నావ్.. అని ప్రశ్నించింది. అప్పుడు శివం తన అసలు రంగు బయటపెట్టాడు. బాలికను బెదిరించి ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని హెచ్చరించాడు. దీంతో బాలిక తీవ్ర భయాందోళనలకు గురయ్యింది.

ఏకాదశి రోజు భర్త చికెన్ వండమన్నాడని.. ఒంటిమీద కిరోసిన్ పోసుకుని భార్య ఆత్మహత్య.. !!

ఈ ఘటన ఈనెల 13న జరిగింది. ఆ తరువాత rape ఘటనతో  తీవ్రంగా భయపడిపోయిన  బాలిక నాలుగు రోజుల పాటు  జ్వరంతో బాధ పడింది. అయితే తల్లి హోటల్ దగ్గరికి ఎందుకు వెళ్లావు... అని అడగ్గా ఆ బాలిక ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది. వెంటనే ఆ తల్లి కూతురు తో కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. అక్కడ శివంపై ఫిర్యాదు చేశారు.  పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Mumbai Family Death: వీడిన పుచ్చ‌కాయ‌, బిర్యానీ మ‌ర‌ణాల మిస్ట‌రీ.. ఇంత‌కీ వాళ్లు ఎలా చ‌నిపోయారంటే
సీఎం ఎవరు? ఉత్కంఠ రేపుతున్నతమిళ రాజకీయాలు| Tamil Nadu Political Mind Blowing Twist | Asianet Telugu