
హైదరాబాద్: అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యుల ప్యానెల్‌లో ఆర్ట్ ఆప్ లివింగ్ వ్యవస్థాపకులు రవి శంకర్‌ను నియమించడంపై హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. రవిశంకర్ స్థానంలో తటస్థులుగా ఉండే మరోకరిని నియమించాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు.
శుక్రవారం నాడు అయోధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు మాజీ సుప్రీంకోర్టు జస్టిస్ ఖలీఫుల్లా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచ్‌లకు సుప్రీంకోర్టు నియమించింది.
అయితే అయోధ్య విషయమై తమ వాదనను ముస్లింలు వెనక్కు తీసుకోకపోతే ఇండియా మరో సిరియాగా మారే అవకాశం లేకపోలేదని రవి శంకర్ వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన రవిశంకర్ తటస్థంగా ఎలా వ్యవహరిస్తారనే విషయాన్ని ఆయన ప్రశ్నించారు.రవిశంకర్ స్థానంలో తటస్థంగా ఉండే మరోకరిని ఈ స్థానంలో నియమించాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు.
సంబంధిత వార్తలు
అయోధ్య వివాదంపై మధ్యవర్తులు: వారి నేపథ్యాలు ఇవే..
అయోధ్య వివాదం: సుప్రీం నియమించిన మధ్యవర్తులు వీరే
అయోధ్య కేసులో తీర్పు రిజర్వ్: మధ్యవర్తిత్వానికి హిందూ సంఘాల వ్యతిరేకత