అయోధ్య వివాదంపై మధ్యవర్తులు: వారి నేపథ్యాలు ఇవే....

By narsimha lodeFirst Published Mar 8, 2019, 12:39 PM IST
Highlights

అయోధ్య కేసులో ముగ్గురు మధ్యవర్తుల ప్యానెల్‌ను  సుప్రీం కోర్టు శుక్రవారం నాడు ఏర్పాటు చేసింది. అయితే  ఈ ప్యానెల్‌కు మాజీ సుప్రీంకోర్టు జస్టిస్ ఇబ్రహీం ఖలీఫుల్లా నేతృత్వం వహిస్తున్నారు. 


న్యూఢిల్లీ: అయోధ్య కేసులో ముగ్గురు మధ్యవర్తుల ప్యానెల్‌ను  సుప్రీం కోర్టు శుక్రవారం నాడు ఏర్పాటు చేసింది. అయితే  ఈ ప్యానెల్‌కు మాజీ సుప్రీంకోర్టు జస్టిస్ ఇబ్రహీం ఖలీఫుల్లా నేతృత్వం వహిస్తున్నారు. ఈ ప్యానెల్‌లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్, సీనియర్ న్యాయవాది, మీడియేషన్‌లో పేరొందిన శ్రీరామ్‌పంచ్‌లకు చోటు దక్కింది.

సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ ఎఫ్ఎం ఖలీఫుల్లాకు 68 ఏళ్లు.  మాజీ జస్టిస్ ఎం. ఫక్కీర్ మహ్మాద్ కొడుకే ఖలీఫుల్లా.  1975 ఆగష్టు మాసంలో  ఖలీఫుల్లా అడ్వకేట్‌గా ప్రాక్టీస్‌ను ప్రారంభించారు.  2000 సంవత్సరంలో ఖలీఫుల్లా  మద్రాస్ హైకోర్టుకు శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు. 2012 ఏప్రిల్ 2వ తేదీన ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు.  ఆ తర్వాత ఆయన రిటైరయ్యారు.

2011 ఫిబ్రవరి మాసంలో జమ్మూ కాశ్మీర్ హైకోర్టు జడ్జిగా ఆయన నియమితులయ్యారు  ఆ తర్వాత రెండు మాసాలకుే ఆ కోర్టుకు ఆయన యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గా నియమింపబడ్డారు.  ఆ తర్వాత 2012లో ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు.2016 జూలై 22వ తేదీన సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన పదవీ విరమణ చేశారు.

ఇక  ఈ ప్యానెల్‌లో మరో సభ్యుడిగా సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచ్ ఉన్నారు.అనేక కేసుల్లో మధ్యవర్తిత్వం వహించిన అనుభవం ఆయనకు ఉంది.  తమిళనాడు రాష్ట్రానికి చెందిన శ్రీరామ్ పంచ్ నేషనల్ అసోసియేషన్  మీడియేషన్ అనే సంస్థకు అధ్యక్షుడుగా కూడ ఉన్నారు.

దేశంలోని పలు కీలకమైన వాణిజ్య, కార్పోరేట్ సంస్థలకు చెందిన  కేసుల పరిష్కారంలో మధ్యవర్తిత్వం వహించారు. దేశంలోని సంస్థలతో పాటు అంతర్జాతీయంగా కూడ ఉన్న సంస్థలకు చెందిన వాణిజ్యపరమైన సమస్యలను పరిష్కరించాడు శ్రీరామ్ పంచ్. అంతర్జాతీయ  వాణిజ్య సమస్యల పరిష్కార వేదిక కమిటీలో  శ్రీరామ్ పంచ్ సభ్యుడుగా ఉన్నారు.

అసోం, నాగాలాండ్ రాష్ట్రాల మధ్య 500 కి.మీ సరిహద్దు సమస్య పరిష్కారం కోసం సుప్రీంకోర్టు శ్రీరామ్ పంచ్‌ను నియమించింది. మరోవైపు ముంబైలో పార్శీ కమ్యూనిటీ వివాదం పరిష్కారంలో  ఆయన కీలకంగా వ్యవహరించారు.

ఇక ఈ ప్యానెల్‌లో సభ్యుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్. తమిళనాడు రాష్ట్రంలో 1956 మే 13న పుట్టాడు.  తండ్రి వెంకటరత్నం, తల్లి విశాలక్షి రత్నం. తమిళనాడు రాష్ట్రంలోని పాపనాశనం ఆయన స్వగ్రామం.  చిన్నతనంలో వేదాలను రవిశంకర్ చదువుకొన్నాడు. అదే సమయంలో స్కూల్‌లో విద్యాభ్యాసాన్ని మానలేదు.

1973లో బెంగుళూరులో డిగ్రీ పూర్తి చేశారు. ఫిజిక్స్, వేదాలపై లిటరేచర్ పూర్తి చేశాడు.గ్రాడ్యుయేషన్ పూర్తైన తర్వాత  మహర్షి మహేష్ యోగి వద్దకు ఇతను వెళ్లాడు. అతని కలిసి ఆయుర్వేద సెంటర్లలో సెమినార్లలో పాల్గొనేవాడు, గురువుకు నమ్మకమైన శిష్యుడుగా మారాడు.  1980లో  ప్రపంచవ్యాప్తంగా పర్యటించారు. 1982లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థను ఏర్పాటు చేశారు. 

ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తం చేసేందుకు ఆయన ప్రపంచదేశాల్లో పర్యటించారు.  1983లో తొలిసారి యూరప్, స్విట్జర్లాండ్ లలో పర్యటించారు. 

1986 లో  కాలిఫోర్నియాలో  ఆర్ట్ ఆఫ్ లివింగ్ వర్క్‌షాప్ నిర్వహించాడు. ఈ వర్క్ షాప్ ద్వారా రవిశంకర్ పేరు ప్రపంచ స్థాయిలో మార్మోగిపోయింది.    
హింసా లేని దేశం, ఒత్తిడి లేని మనుషులు  దేశాల మధ్య శాంతి కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. రవిశంకర్ శ్వాసలో సుదర్శన క్రియ చేయడంలో చాలా ప్రఖ్యాతి చెందాడు. 

సంబంధిత వార్తలు

అయోధ్య వివాదం: సుప్రీం నియమించిన మధ్యవర్తులు వీరే
అయోధ్య కేసులో తీర్పు రిజర్వ్: మధ్యవర్తిత్వానికి హిందూ సంఘాల వ్యతిరేకత

click me!